Saturday, April 27, 2024

మయామి ఓపెన్‌లో టీనేజర్ సంచలనం

- Advertisement -
- Advertisement -

Jannik Sinner reaches Miami Open final

 

ఫైనల్ చేరిన నాలుగో టీనేజర్‌గా సిన్నర్ రికార్డు

మయామి: ఇటలీకి చెందిన 19 ఏళ్ల జన్నిక్ సిన్నర్ మయామి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్‌కు చేరిన నాలుగో టీనేజర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఆండ్రీ అగస్సీ, రఫెల్ నడాల్, నోవాక్ జకోవిచ్‌లు మాత్రమే ఈ ఘనత సాధించారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సిన్నర్ తమ దేశానికే చెందిన రాబర్టో బటిస్టా అగట్‌ను 5 7, 6 4,6 4 స్కోరుతో ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాడు. ఫైనల్లో ఈ యువ సంచలనం పోలండ్‌కు చెందిన 26వ సీడ్ హుబర్ట్ హుర్కక్జ్‌తో తలపడతాడు. అంతకు ముందు జరిగిన మరో సెమీ ఫైనల్లో హుర్కక్జ్ నాలుగో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్‌ను 6 3, 64 స్కోరుతో వరస సెట్లలో చిత్తు చేసి ఫైనల్‌కు చేరాడు. గత ఏడాది ప్రారంభంలో 78వ స్థానంలో ఉండిన సిన్నర్ ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి బరిలోకి దిగి క్వార్టర్ ఫైనల్‌కు చేరడం ద్వారా వార్తల్లోకి ఎక్కాడు. మయామి టోర్నమెంట్ ముగిశాక అతని ర్యాకింగ్ కనీసం 24కు చేరుకోవడం ఖాయం. కాగా సిన్నర్, హుర్కక్జ్ ఇద్దరూ మంచి స్నేహితులు కావడమే కాక, డబుల్స్ పార్టర్స్ కూడా.

మహిళల ఫైనల్లో బియాంక

కాగా మహిళల సింగిల్స్‌లో యుఎస్ ఓపెన్ చాంపియన్ బియాంక ఆండ్రెస్కూ (కెనడా) ఫైనల్‌కు చేరింది. మరియా సాకరి(గ్రీస్)తో జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ అయిన బియాంక 2 గంటల 42 నిమిషాల పాటు పోరాడి 7 6(9/7), 3 6, 7 6(7/4)స్కోరుతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. యుఎస్ ఓపెన్ తర్వాత బియాంక మరో టోర్నమెంటు ఫైనల్ చేరడం ఇదే ప్రథమం, శనివారం జరిగే ఫైనల్లో ఆమె నంబర్ వన్, టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)తో తలపడుతుంది. మరో సెమీ ఫైనల్లో బార్టీ 6% 3,6 3 స్కోరుతో ఎలీనా స్వితోలినా( ఉక్రెయిన్)పై గెలిచింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News