Thursday, May 2, 2024

అక్టోబర్ 28న సింగరేణి ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ అక్టోబర్ 28న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నటు బుధవారం రిటర్నింగ్ ధికారి, చీఫ్ లేబర్ కమిషనర్ డి.శ్రీనివాస్ నోటిపికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం అక్టోబర్ 6, 7 తేదీల్లో నామినేషన్‌న్లను స్వీకరించనున్నారు. 9వ తేదీన స్క్రూటిని విత్‌డ్రాకు అవకాశం ఇవ్వానున్నారు. 28న పోలింగ్ నిర్వహించనుండగా అదే రోజు కౌంటింగ్ చేపట్టనున్నారు.అయితే మే 22న సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం కార్మిక సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

అయితే వరుస పండగలు ఉండటంతో ఎన్నికలు వాయిదా వేయాలి సింగరేణి యాజమాన్యం కోరింది. సింగరేణి సంస్థ అభ్యర్థనను తిరిస్కరించిన హై కోర్టు అక్టోబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. 2019లోనే గుర్తింపు సంఘం కాలపరిమితి ముగియగా కొన్ని సాంకేతిక కారణాలతో ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ అంశంపై గుర్తింపు సంఘం హై కోర్టును ఆశ్రయించగా అక్టోబర్‌లోనే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించడంతో డిప్యూటీ సీఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఎన్నికలపై గందరగోళం ః
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై గందర గోళం నెలకొంది. ఇప్పుడు ఎన్నికలు వద్దంటూ 13 కార్మిక సంఘాల లేఖ రాసిన డివైఎల్‌సి షెడ్యూల్ విడుదల చేసింది. ఏక పక్ష నిర్ణయంతో సింగరేణి వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేసేందుకు సంఘాలు నాయకులు సిద్దం అవుతున్నట్లు తెలిసింది.జిల్లా యంత్రాంగం సహకారం లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించకుండా షెడ్యూల్ విడుదల చేయడం సరికాదంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు సాధ్యం కావని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News