Thursday, May 2, 2024

ఎర్రకోట వద్ద భారీగా పోలీసు బలగాల మోహరింపు

- Advertisement -
- Advertisement -

Security tightened at Red Fort in the national capital

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం రైతులు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీ సంధర్భంగా చెలరెగిన హింసపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీ సరిహద్దుల్లో మరింత భద్రతను పెంచింది. నిన్నటి కిసాన్ పరేడ్ ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ పోలీసులు హింసను ప్రేరేపించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఎర్రకోట వద్ద భారీగా మోహరించిన పోలీసు బలగాలు, ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల దీక్షా శిబిరాల వద్ద కూడా కేంద్రం పారామిలటరీ బలలగాలను మోహరించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్లు, జామా మసీదు మెట్రో స్టేషన్ ప్రవేశ గేటును అధికారులు మూసివేశారు. నిన్నటి ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రైతుల ట్రాక్టర్ల ర్యాలీలో 300 మందికిపైగా పోలీసులు గాయపడినట్టు అధికారులు వెల్లడించారు.

Security tightened at Red Fort in the national capital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News