Thursday, May 2, 2024

నకిలీ మందులు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

పరారీలో నలుగురు నిందితులు

మనతెలంగాణ, సిటిబ్యూరోః నకిలీ మందులు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను సౌత్‌వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.29,72,850 నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…పోకల రమేష్, బీరెళ్లి రాఘవ రెడ్డి, పూర్ణచందర్, లక్ష్మణ్, నదీం, అరుణ్ చౌదరి కలిసి నకిలీ మందులు విక్రయిస్తున్నారు. రమేష్, రాఘవ ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీగా నష్టపోయారు. ఈ క్రమంలోనే రమేష్ బావమరిదికి ఆల్ఫాజొలాం ట్యాబ్లెట్స్ విక్రయించడంతో నకిలీ మందులపై అవగాహన ఉంది. అతడి సాయంతో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మిగతా వారి ద్వారా నకిలి మందులు కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకుని వచ్చి ఎలాంటి లైసెన్స్ లేకుండానే నకిలీ మందులను సప్లయ్ చేస్తున్నారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సైలు ఎండి ముజఫర్ అలీ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News