Thursday, May 2, 2024

వర్షానికి ఇళ్లు కూలిన బాధితులు ఆందోళన చెందొద్దు

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్

మునిపల్లి: గత ఐదు రోజులుగా కురిసిన వర్షానికి ఇళ్లు దెబ్బతినడంతోపాటు ఇండ్లు కూలిన బాధితులు ఎవరూ ఆందోళనచెందవద్దని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. ఈసందర్బంగా మండలంలోని అంతారం గ్రామంలో వర్షానికి పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లను అధికారులు, ప్రజాప్రతినిధులతోకలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ వర్షానికి ఇండ్లు దెబ్బతినడంతో ఎవరూ అధైర్య పడొద్దని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకంతో ఇండ్లు మంజూరు నిర్మిస్తామన్నారు. అనంతరం పెద్దచెల్మెడ గ్రామానికిచెందిన బీఆర్‌ఎస్ నాయకుడు సుధాకర్ మాతృమూర్తి ఇటీవల మృతి చెందింది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శిం ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపిపి శైలజ శివశంకర్, జడ్‌పిటిసి పైతర మీనాక్షి సాయికుమార్, బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయకుమార్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి శశికుమార్, మాజీ మండల అధ్యక్షుడు వార్నాసి సతీష్ కుమార్, ఎంపిడిఓ హరినందన్ రావు, ఎంపిఓ అంజనీదేవి, ఆర్‌ఐ రవీందర్, బీఆర్‌ఎస్ యూత్ మండల అధ్యక్షుడు ఆనంద్, మైనార్టీ మండల అధ్యక్షుడు మౌలాన, మార్కెట్‌కమిటీ డైరెక్టర్ చెన్నవీరయ్యస్వామ , నాయకులు రాంచందర్ రావు, కుతుబోద్దీన్, తాటిపల్లి మల్లేశం నగేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News