Wednesday, May 1, 2024

మా ఆదేశాలే బేఖాతరా?: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌పై సుప్రీం ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతోపాటు పలువురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వచ్చిన పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా అసెంబ్లీ స్పీకర్ జాప్యం చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులను స్పీకర్ బేఖాతరు చేయలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేయలేరని ఎవరైనా స్పీకర్‌కు సలహా ఇవ్వండి అంటూ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారాన్ని ఎప్పటిలోగా తేలుస్తారో కాలవ్యవధి చెప్పాలని అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం ఆదేశించింది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల లోపల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని, లేకపోతే మొత్తం ప్రక్రియే నిరర్థకమవుతుందని సిజెఐ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. స్పీకర్ ఇచ్చే కాల వ్యవధి తమను సంతృప్తి పరచని పక్షంలో రెండు నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలని తామే ఆదేశిస్తామని ధర్మాసనం హెచ్చరించింది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిరాలు జరిగినపుడు సుప్రీంకోర్టు ఉత్తర్వులే అత్యున్నతమైనవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వచ్చే సోమవారం లేదా మంగళవారం ఇందుకు సంబంధించిన పిటిషన్లపై విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది.

ముఖ్యమంత్రి షిండే, ఇతర శివసేన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారో కాలవ్యవధిని చెప్పాలంటూ అహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 18న ఆదేశించింది. కాగా..ఇప్పటివరకు దీనిపై స్పీకర్ నుంచి ఎటువంటి సమాధానం కోర్టుకు రాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News