Monday, May 13, 2024

మళ్లీ ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు

- Advertisement -
- Advertisement -

మళ్లీ ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు
స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో తిరగబడిన సర్వర్ సమస్య
ఉదయం నుంచి ఇబ్బందులు పడిన క్రయ, విక్రయదారులు
మనతెలంగాణ/హైదరాబాద్: స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో మళ్లీ సర్వర్ సమస్య తిరగబడింది. ఈనెలలో ఈ సమస్య ఎదురుకావడం ఇది రెండోసారి. గురువారం ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చాలాచోట్ల రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోయాయి. మాములుగా గంటలో 5 నుంచి 10 రిజిస్ట్రేషన్‌లు ప్రతిరోజు జరుగుతుండగా గురువారం ఒకటి రెండు రిజిస్ట్రేషన్‌లతోనే సరిపెట్టారు. సర్వర్ సమస్య ఎదురయ్యిందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా టెక్నికల్ టీంలు గచ్చిబౌలి డేటా సెంటర్‌లోని (ఎస్‌డిసి)లోని ప్రధాన సర్వర్ నెట్‌వర్క్‌లో సాంకేతిక సమస్యలను గుర్తించడానికి ప్రయత్నించాయి. అయినా మధ్యాహ్నం తరువాత ఈ సమస్యను ఉన్నతాధికారులు పరిష్కరించారు. ప్రతిరోజు 24 స్లాట్ బుకింగ్‌లకు రిజిస్ట్రేషన్‌లు జరుగుతుండగా సమయం మిగిలితే మరికొన్ని రిజిస్ట్రేషన్‌లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్వర్ డౌన్ కావడంతో స్లాట్ బుక్ చేసుకున్న వారు ఇబ్బందులు పడ్డారు.
ఈ నెల మొదటివారంలో సుమారు ఐదురోజులు
ఈ నెల మొదటివారంలో సుమారు ఐదురోజుల పాటు సర్వర్ సమస్యతో వినియోగదారులు, సబ్ రిజిస్ట్రార్‌లు ఇబ్బందులు పడ్డారు. ఈనెల 2వ తేదీ నుంచి సబ్ రిజిస్ట్రార్ లాగిన్‌లోని కార్డు అప్లికేషన్ ఓపెన్ కాలేదు. రాష్ట్ర మంతా రిజిస్ట్రేషన్‌కు సంబంధించి అనేక సమస్యలు ఉత్పన్నం కావడంతో టెక్నికల్ టీంలు గచ్చిబౌలి డేటా సెంటర్‌లోని (ఎస్‌డిసి)లోని ప్రధాన సర్వర్ నెట్‌వర్క్‌లో సాంకేతిక సమస్యను గుర్తించాయి. అప్పటి నుంచి దీని సరిచేయడానికి టెక్నికల్ టీం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అనంతరం రెండురోజుల తరువాత కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నెట్‌వర్క్ సమస్య తీరినా మరికొన్ని చోట్ల ఈ సమస్య అలాగే ఉండిపోయింది. అనంతరం ఈనెల 6వ తేదీన టెక్నికల్ టీంలు పూర్తిస్థాయిలో సమస్యలు పరిష్కరించారు. 07వ తేదీ నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాఫీగా సాగిపోయింది. మాములుగా ప్రతిరోజు సగటున రాష్ట్రవ్యాప్తంగా 3,500లకు పైగా రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా, ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో 900 వరకు జరుగుతున్నాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తెలిపారు.
సర్వర్ డౌన్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
సయ్యద్ సిరాజ్ అన్వర్, శంకర్‌పల్లి, సబ్ రిజిస్ట్రార్
ప్రతిసారీ ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నాం. సర్వర్ డౌన్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. స్లాట్ బుక్ చేసుకున్న వారి రాకతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిక్కిరిసి పోతున్నాయి. వారికి సమాధానం చెప్పలేకపోతున్నాం.

Server Issues again in online registration in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News