Monday, April 29, 2024

షెహబాజ్ నేతృత్వంలో పాక్‌లో సంకీర్ణ ప్రభుత్వం?

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ మధ్య అధికార పంపిణీలో ఒక అంగీకారం కుదిరింది. ఇది వారి ప్రధాన ప్రత్యర్థి ఇమ్రాన్‌ఖాన్‌ను పక్కదారి పట్టించే ఎత్తుగడ. జైలులో బందీగా ఉన్న ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులైన ఇండిపెండెంట్ అభ్యర్థుల కన్నా పిఎంఎల్‌ఎన్, పిపిపి పార్టీ అభ్యర్థులు తక్కువ సంఖ్యలో సీట్లు గెలుచుకున్నారు.

భారీ ఎత్తున చర్చలు జరిగిన తరువాత పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పిఎంఎల్‌ఎన్) అధ్యక్షుడు 72 ఏళ్ల షెహబాజ్ షరీఫ్ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడతారని మంగళవారం రాత్రి పత్రికా సమావేశంలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ వెల్లడించారు. అదే విధంగా పీపీపీ కో ఛైర్మన్ 68 ఏళ్ల ఆసిఫ్ అలీ జర్దారీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపడతారు. ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన అభ్యర్థుల మద్దతు పిపిపి, పిఎంఎల్‌ఎన్ ఇప్పుడు సాధించాయని బిలావల్ భుట్టో వెల్లడించారు. అయితే ఎంతమంది సభ్యులు తమకు మద్దతు ఇస్తున్నారో ఆయన వివరించలేదు. నేషనల్ అసెంబ్లీ లోని మొత్తం 266 మంది సభ్యుల్లో పోటీ చేసిన 265 స్థానాలకు గాను 133 సీట్లు లభిస్తేనే ప్రభుత్వం ఏర్పాటుకు వీలౌతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News