Thursday, May 2, 2024

రికార్డులే.. రికార్డులు

- Advertisement -
- Advertisement -

వాంఖడే స్టేడియంలో భారత్‌శ్రీలంక జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి ఈ మ్యాచ్‌లో అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. భారత్ తరఫున ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా షమి నిలిచాడు. అంతేగాక వరల్డ్‌కప్‌లో అత్యధిక సార్లు నాలుగుకు పైగా వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. దీంతో భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా షమి రికార్డు నెలకొల్పాడు. షమి నాలుగు సార్లు ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో శ్రీనాథ్, హర్భజన్‌ల పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. మరోవైపు ప్రపంచకప్‌లో అత్యల్ప స్కోరును నమోదు చేసిన జట్టుగా శ్రీలంక చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో లంక 55 పరుగులకే కుప్పకూలింది. ఇక భారత్ 302 పరుగుల తేడాతో లంకను ఓడించి పరుగుల పరంగా నాలుగో భారీ విజయాన్ని అందుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News