- Advertisement -
చార్మింగ్ స్టార్ శర్వా తన 36వ మూవీ ‘శర్వా 36’లో స్కిల్ మోటార్ సైకిల్ రేసర్‌గా కనిపించబోతున్నారు. అభిలాష్ కంకర దర్శకత్వంలో ప్రతిష్టాత్మక యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శర్వా, టీమ్‌పై రేస్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా ఉండబోతున్నాయి. శుక్రవారం మేకర్స్ శర్వానంద్ పర్సనల్ స్టిల్స్‌ని విడుదల చేశారు. స్టైలీష్ మేకోవర్‌లో శర్వా లుక్స్ అదిరిపోయాయి. ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయికగా నటించగా, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ హై -ఎనర్జీ మూవీ మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది.
Also Read : ట్రైలర్ వచ్చేస్తోంది
- Advertisement -