Thursday, May 1, 2025

‘భోగి’ షూటింగ్ షురూ

- Advertisement -
- Advertisement -

చార్మింగ్ స్టార్ శర్వా, బ్లాక్‌బస్టర్ మేకర్ సంపత్ నంది ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘శర్వా38’ కోసం తొలిసారి కలిసి పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. 1960 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించబోతోంది. దర్శకుడు సంపత్ నంది విధి, పోరాటం, మార్పు అనే కథను చెబుతున్న నేపథ్యంలో మొదలైన వీడియోలో ఈ సినిమా టైటిల్ ‘భోగి’ అని తెలియజేశారు. ఈ సినిమా షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భోగి సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News