Sunday, April 28, 2024

పబ్లిక్ లో ఇదేం డ్రెస్…. మెట్రో వార్నింగ్… వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

కురచ డ్రెస్‌లో మెట్రోలో మహిళ: డిల్లీ మెట్రో ఏమన్నదంటే..(వైరల్ వీడియో)

 

న్యూస్‌డెస్క్: ఢిల్లీ మెట్రోలో కురుచ దుస్తులు ధరించి ప్రయాణించిన ఒక మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులు సభ్యతా సంస్కారాలు పాటించాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డిఎంఆర్‌సి) విజ్ఞప్తి చేసింది.
మెట్రో కోచ్‌లో ఒక మహిళ పక్కన కూర్చున్న మరో మహిళ తాను దిగాల్సిన స్టేషన్ వచ్చినపుడు లేచి నిలబడగా ఆమె ధరించిన దుస్తులు అత్యంత కురచగా ఉండడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోను ఎన్‌సిఎంఇండియా కౌన్సిల ఫర్ మెన్ అఫేర్స్ తన ట్విటర్ హ్యాండిల్ షేర్ చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడ్డారు.  శరీరమంతా కనిపించే విధంగా అసభ్యకర దుస్తులు వేసుకున్న వారిపై డిఎంఆర్‌సి ఎటువంటి చర్యలు చేపడుతుందని నెటిజన్లు ప్రశ్నించారు.

దీంతో డిఎంఆర్‌సి వివరణ ఇవ్వక తప్పలేదు. సమాజంలో అందరికీ అంగీకారయోగ్యమైన సాంప్రదాయాలు, సామాజిక బాధ్యతను ప్రయాణికులు పాటిస్తారని తాము ఆశిస్తున్నామని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిఎంఆర్‌సి తెలిపింది. తోటి ప్రయాణికుల మనోభావాలను దెబ్బతీసే దుస్తులను కాని కార్యకలాపాలను కాని ప్రయాణికులు ఎవరూ చేయరాదని డిఎంఆర్‌సి సూచించింది. అసభ్యకర వస్త్రధారణ సెక్షన్ 59 కింద శిక్షార్హమైన నేరమని కూడా పేర్కొంది. ప్రయాణించే సమయంలో తమ దుస్తుల ఎంపిక తమ వ్యక్తిగతమైన విషయమని ఎవరైనా వాదించినప్పటికీ బహిరంగ ప్రదేశాలలో ముఖ్యంగా మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణించేటప్పుడు బాధ్యతయుతంగా ఉండడంతోపాటు ఇతరులను నొప్పించే విధంగా ఉండరాదని డిఎంఆర్‌సి హితవు చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News