Saturday, April 27, 2024

అఖిలేశ్ ‘నేటి ఔరంగజేబు’: శివరాజ్ చౌహాన్

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు వ్యక్తిగత నిందలకు కూడా ఆలవాలమైంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌ను ఆధునిక ఔరంగజేబు అని విమర్శించారు. “ అఖిలేశ్ నేటి ఔరంగజేబు. ఆయన తన తండ్రికే విశ్వాసపాత్రుడిగా ఉండలేదు, ఇక మీకు ఎలా విశ్వాసపాత్రుడిగా ఉండగలడు?” అని శివరాజ్ చౌహాన్ ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తూ అన్నారు. ఆయన ఇంకా అఖిలేశ్‌పై విమర్శలు గుప్పిస్తూ, “ములాయం సింగే ఒకప్పుడు … ఔరంగజేబు తన తండ్రినే కారాగారంలో పడేశాడు. సోదరులను చంపేశాడు. అఖిలేశ్ తనని అగౌరవపరిచినంతగా మరెవరూ తనని అగౌరవ పరచలేదు అన్నారు” అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ అన్నట్లు ఎఎన్‌ఐ కోట్ చేసింది. అఖిలేశ్‌ను మొగల్ చక్రవర్తి ఔరంగజేబుతో పోల్చడం ఇదే తొలిసారి కాదు. 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయన్ని ఔరంగజేబుతో పోల్చారు. “ఔరంగజేబు తన తండ్రి షా జహాన్‌ను జైలులో వేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు” అన్నారు.
“ఔరంగజేబులా తన తండ్రినే పదవీచ్యుతుడిని చేసిన వ్యక్తి, బద్ధ శత్రువుతో చేతులు కలిపాడు. మే 23 తర్వాత మళ్లీ వారు ఒకరినొకరు దూషించుకుంటారు. ఈ కలగూరగంప మనుషులు (మహామిలావటి పీపుల్) వరదలప్పుడు కలుసుకునే తేళ్లు, కప్పలు, పాముల వలే ప్రవర్తిస్తున్నారు” అని యోగి మూడేళ్ల కిందటే ట్వీట్ చేశారు. అఖిలేశ్ యాదవ్‌ను ఔరంగజేబుతో పోల్చడం అన్నది 2016లో మొదలయింది. సమాజ్‌వాదీ పార్టీపై నియంత్రణ సాధించేందుకు అఖిలేశ్ యాదవ్ తన పిన్నాన్న శివపాల్ యాదవ్‌తో నాడు తీవ్రంగా విభేదించారు. ఏదిఏమైనప్పటికీ ఉత్తరప్రదేశ్ ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగనుంది. ప్రజల తీర్పు ఎటో వేచి చూద్దాం!

Shivraj Chauhan slams Akhilesh Yadav

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News