Thursday, May 2, 2024

ఓయూలో మార్చి 27, 28 తేదీల్లో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్:  విసి రవీందర్‌ యాదవ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం మార్చి 27, 28 తేదీలలో జాతీయ స్థాయి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు విసి రవీందర్‌ యాదవ్ తెలిపారు. ‘జష్న్ ఏ సిన్మా’ గా వ్యవహరించే ఈ ఫెస్టివల్‌కు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం ఓయూ పరిపాలనా భవనంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఆర్ట్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చింత గణేశ్, జర్నలిజం విభాగం హెడ్ డాక్టర్ టి. సతీశ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

అనంతరం వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా యూజీ, పీజీ విద్యార్థులతో పాటు పరిశోధక విద్యార్థులు సైతం ఈ పోటీల్లో పాల్గొనవచ్చని వివరించారు. షార్ట్ ఫిలమ్స్ రూపొందించే విద్యార్థులకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఈ ఫెస్టివల్ లో దక్కుతుందని చెప్పారు. ఈ రెండు రోజుల భారీ ఈవెంట్ లో భాగంగా పోటీలు, వర్క్‌షాప్, ప్యానల్ డిస్కషన్స్ వంటివి నిర్వహిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తామన్నారు. ఇతర వివరాలకు jashnesainma@gmail.com మెయిల్లో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ విష్ణుదేవ్, ప్రొఫెసర్ కృష్ణకుమార్, ప్రొఫెసర్ రామయ్య తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News