Friday, May 3, 2024

ప్రపంచంలో ఆరు మిలియన్ నర్సుల కొరత

- Advertisement -
- Advertisement -

Nurses

 

జెనీవా : ప్రపంచ మంతా కరోనా కల్లోలంతో తల్లడిల్లుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యచికిత్సకు సహకరించేందుకు దాదాపు ఆరు మిలియన్ నర్సుల అవసరం ఉందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఐక్యరాజ్యసమితి ఆరోగ్యసంస్థ తోపాటు భాగస్వాములైన నర్సింగ్ నౌఅండ్ ది ఇంటర్నేషనల్ కౌన్సిలు ఆఫ్ నర్సెస్ (ఐసిఎన్) ఒక నివేదికలో నర్సుల కీలక పాత్ర వివరించారు. ప్రపంచంలో 28 మిలియన్ నర్సులు ఉన్నారని వివరించింది. 2018 వరకు మొత్తం ఐదేళ్లలో నర్సుల సంఖ్య 4.7 మిలియన్‌కు పెరిగినా ఇంకా 5.9 మిలియన్ వరకు కొరత కనిపిస్తోందని డబ్లుహెచ్‌ఒ వివరించింది.

ఆఫ్రికా, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యల్లో పేద దేశాలు, దక్షిణ అమెరికా లోని కొన్ని ప్రాంతాల్లో నర్సుల కొరత కనిపిస్తోందని నర్సుల సంఖ్యలో ఈ లోపాలను గుర్తించి నర్సింగ్ ఎడ్యుకేషన్‌కు, ఉద్యోగాల కల్పనకు, అజమాయిషీకి పెట్టుబడి పెట్టాలని సూచించింది. నర్సుల కొరత ఉన్న చోట వ్యాధుల కేసులు, వైద్య లోపాలు, మరణాల శాతం ఎక్కువగా ఉంటోందని ఐసిఎన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హోవర్డ్ కేటన్ అన్నారు. . నర్సింగ్ నౌ నివేదికకు సహకరించిన మేరీ వాట్‌కిన్స్ ఆరోగ్య సిబ్బందికి వైరస్ పరీక్ష కోసం తక్షణం పెట్టుబడి సమకూర్చాలని పిలుపు నిచ్చారు. ప్రపంచం మొత్తం మీద 80 శాతం మంది నర్సులు మాత్రమే ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 50 శాతం మందికి సేవ చేస్తున్నారని చెప్పారు.

Shortage of six million Nurses in world
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News