Tuesday, May 14, 2024

కేజ్రీవాల్ ఐదు సూత్రాల ప్రణాళిక

- Advertisement -
- Advertisement -

Kejriwal

 

న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐదు సూత్రాల ప్రణాళికను ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి దాని గురించి వివరించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్, టీమ్ వర్క్, ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ అనే (5టి) ప్లాన్‌ను సిఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా 12 వేల హోటల్ గదులను అద్దెకు తీసుకుని క్యారంటైన్ కేంద్రాలుగా మార్చబోతున్నామని చెప్పారు. 8 వేల మందికి సరిపోయేలా అత్యవసర చికిత్స అందించే ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ఐదు లక్షల మందికి ర్యాండమ్ పరీక్షలు (టెస్టింగ్).

కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులను త్వరితగతిన గుర్తించడం (ట్రేసింగ్)

పాజిటివ్ కేసులకు పూర్తి స్థాయిలో వైద్యం (ట్రీట్‌మెంట్)

ప్రభుత్వ వ్యవస్థల మధ్య సమన్వయంతో జట్టుగా కరోనాపై పోరాటం (టీమ్ వర్క్)

మర్కజ్ లో పాల్గొన్న వారిని త్వరగా గుర్తించి, వారు కలిసిన ఇతరుల పై పర్యవేక్షణ (ట్రాకింగ్ అండ్ మానిటరింగ్)

 

Kejriwal key decision for prevent corona
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News