Monday, July 22, 2024

గన్ గురిపెట్టి మహిళా కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ అత్యాచారం

- Advertisement -
- Advertisement -

ఏదైనా సమస్య వస్తే పోలీసుల వద్దకు ప్రజలు వెళ్తుంటారు. అలాంటి పోలీసులకే సమస్య వస్తే, అది కూడా తోటి ఖాకీ డ్రెస్ వేసుకున్న వ్యక్తితోనే ఇబ్బంది ఎదురైతే ఆ మనిషి చూసే నరకం అంతా ఇంతా కాదు. అలాంటి ఘటనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో చోటు చేసుకుంది. అక్కడ ఎస్‌ఐగా పని చేస్తున్న భవాని సేన్ తనతో కలిసి పని చేస్తున్న మహిళా కాని స్టేబుల్‌ను వేధించారు. కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న ఓ మహిళ కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఒకసారి కాదు వరు సగా అత్యాచారం చేసినట్లు సమాచారం. ఎవరికైనా ఈ విషయం చెప్తే తుపాకీతో చంపేస్తానని మహిళా కానిస్టేబుల్‌ని బెదిరించినట్టు తెలిసింది. ఇన్ని రోజులు సమస్యను ఎవరికి చెప్పుకోలేక మిన్నకుండిపోయిన ఆ కానిస్టేబుల్, వేధింపులు ఎక్కువ అయ్యేసరికి నోరు విప్పాల్సి వచ్చింది.

ఎస్‌ఐ భవానిసేన్ వేధింపులు భరించలేక ఎస్‌పిని కలిసి తన గోడును మహిళ కానిస్టేబుల్ చెప్పుకుంది. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో చర్య లకు ఉపక్రమించిన ఉన్నతాధికారులు రహస్యంగా విచారించారు. దీని కోసం ఓ టీంను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌లో మంగళవారం రాత్రి రహస్యంగా విచారణ జరిపారు. ఇప్పటి వరకు ఒక కానిస్టేబుల్‌నే వేధించారని అనుకుంటే విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు డిఎస్‌పిలు విచారణ చేయగా ముగ్గురు మహిళ కానిస్టేబుళ్లు నోరు విప్పినట్టు సమాచారం. తమను కూడా ఎస్‌ఐ భవానిసేన్ వేధించినట్టు వాళ్లు చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. స్టేషన్‌లో మహిళ కానిస్టేబుల్ స్టేట్‌మెం ట్‌తో ఎస్‌ఐ భవానీ సేన్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించారు. అన్నీ నిజమని తేలడంతో ఎస్‌ఐ భవానీ సేన్‌పై లైంగిక వేధింపులు, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు తెలిసింది.

సర్వీస్ రివాల్వర్ స్వాధీనం
గతంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనూ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో సస్పెన్షన్ వేటు వేసిన ఉన్నతాధికారులు. ఇప్పుడు అదే ఆరోపణలతో ఎస్‌ఐ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఆయన సర్వీస్ రివాల్వర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఎస్‌ఐ భవాని సేన్‌ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు
మల్టీజోన్ I ఐజిపి రంగనాథ్ ఉత్తర్వులు జారీ
మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్. ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐ జి పి ఏ. వి.రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ పై స్టేషన్ ఎస్. ఐ భవాని సేన్ తుపాకీ చూపించి లైంగిక దాడికి పాల్పడినట్లు సదరు మహిళా హెడ్ కానిస్టేబుల్ పోలీస్ ఉన్నతాధి కారులకు ఫిర్యాదు చేయడంతో భూపాలపల్లి ఎస్పీ చేపట్టిన విచారణ లో ఎస్‌ఐ మహిళా హెడ్ కానిస్టేబుల్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లుగా నిజ నిర్ధారణ కావడంతో పాటు ఎస్. ఐ భవాని సేన్ గత 2022 జులై మాసంలో లైంగిక వేధింపులకు పాల్పడంతో ఇతనిపై ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది.

సదరు ఎస్. ఐ తన హోదా అడ్డుపెట్టుకొని మరో ముగ్గురు మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల పై లైంగిక దాడులకు పాల్పడినట్లుగా ఆరోపణలు రావడంతో పాటు ఎస్. ఐ తరుచుగా లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడే వ్యవహారం పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్ట దిగజార్చే విధంగా ఉంది. ఎస్. ఐ పై ఈ పరిస్థితుల్లో విచారణ చేయడం సరైన నిర్ణయం కాదనే ఆలోచనతో కాళేశ్వరం ఎస్. ఐ భవాని సేన్ పై ఎలాంటి విచారణ లేకుండానే భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఆర్టికల్ 311 ప్రకారం సర్వీసు నుండి శాశ్వతంగా తొలగిస్తు నట్లుగా మల్టీ జోన్ I ఐ జి పి శ్రీ ఏ. వి. రంగనాథ్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News