Tuesday, August 5, 2025

రిపోర్టర్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన సిరాజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్ డ్రాగా ముగిసింది. సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో చివరి టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఐదో టెస్టులో సిరాజ్ తొమ్మిది వికెట్ల తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడు. ఈ సందర్భంగా సిరాజ్‌ను ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఓ మాదిరి ప్రదర్శన చేశారని, ఇప్పుడు అద్భుతంగా రాణించారని కారణం ఏంటని అడిగాడు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో 20 వికెట్లు తీశానని, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్ లో 23 వికెట్లు తీశానని వివరణ ఇచ్చాడు. జట్టులో బుమ్రాను ఉన్నప్పుడు ప్రత్యర్థి బ్యాటర్లు మిగితా బౌలర్లపై దాడి చేస్తారని, లైన్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇంగ్లాండ్‌పై బౌలింగ్ కోసం ప్రత్యేకంగా ఏమీ కష్టపడలేదని, కొన్నిసార్లు పరుగులు పోతుంటాయని, ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఎక్కువగా ప్రయత్నస్తానని సిరాజ్ తెలిపాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ అద్భుతంగా జరిగిందని, 2-2 సమం చేసిన సూపర్‌మెన్ అభినందనలు భారత మాజీ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ తెలిపారు.

టెస్టు క్రికెట్ అనేది అత్యుత్తమైందని మరోసారి నిరూపితమైందని, శుభ్‌మన్ గిల్ నాయకత్వం బాగుందని, కోచింగ్ బృందానికి టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ అభినందించారు.

ఐదు టెస్టులో బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేయడంతో టీమిండియా విజయం సాధించిందని భారత మాజీ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తెలిపారు. సిరాజ్‌ను ప్రత్యేకంగా అభినందించాలని, శాయశక్తులా శ్రమిస్తాడని, అతడి ప్రదర్శన చాలా సంతోషంగా ఉందని విరాట్ పేర్కొన్నారు.

కొన్ని మ్యాచ్‌లో ఓడిపోతాం, కొన్నింట్లో గెలుస్తామని, ఎప్పుడూ పోరాటం మాత్రం ఆపమని కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News