Saturday, September 14, 2024

సిసోడియా జుడిషియల్ రిమాండ్ 14 రోజుల పొడిగింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా జుడిషియల్ రిమాండ్‌ను 14 రోజులపాటు పొడిగిస్తూ ప్రత్యేక కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ కేసులో అరెస్టయిన సిసోడియా జుడిషియల్ కస్టడీని ఏప్రిల్ 3వ తేదీ వరకు కొర్టు పొడిగించింది.

ఢిల్లీలో ఎక్సయిజ్ విధానాన్ని రూపొందించడంలో అవినీతికి పాలడ్డారన్న ఆరోపణపై ఫిబ్రవరి 26న సిసోడియాను సిబిఐ అరెస్టు చేసింది. తీహార్ జైలులో ఉన్న సిసోడియాను మార్చి 9న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై ఇడి దర్యాప్తు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News