Sunday, April 28, 2024

చేతులు మారిన రూ. 1.63 కోట్లు: టిఎస్‌పిఎస్‌సి కేసులో సిట్ చార్జిషీట్

- Advertisement -
- Advertisement -

చేతులు మారిన రూ. 1.63 కోట్లు: టిఎస్‌పిఎస్‌సి కేసులో సిట్ చార్జిషీట్

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి)ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) శుక్రవారం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది.

ఈ కేసుకు సంబంధించి ఇప్టపివరకు 49 మంది నిందితులను అరెస్టు చేసినట్లు నగర పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. న్యూజీల్యాండ్‌లో నివసిస్తున్న ఒక నిందితుడు మాత్రం పరారీలో ఉన్నట్లు వారు తెలిపారు. టిఎస్‌పిఎస్‌పి ప్రశ్నాపత్రాల కొనుగోలు, అమ్మకం లావాదేవీలలో మొత్తం రూ. 1.63 కోట్లు చేతులు మారాయని నగర పోలీసులు తెలిపారు. నిందితుల అరెస్టు సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఆధారాలను రామాంతపూర్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీకి పంపి, నిపుణుల అభిప్రాయాన్ని సేకరించినట్లు వారు చెప్పారు. న్యాయ సలహాలు పొందిన తర్వాత ప్రాథమిక చార్జిషీట్ నేడు దాఖలు చేసినట్లు వారు ప్రకటనలో తెలిపారు.

ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజనీర్ల(ఎఇ) పరీక్షను టిఎస్‌పిఎస్‌సి మార్చి 15న రద్దు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News