Tuesday, May 14, 2024

క్వారీలో జిలటిన్ స్టిక్స్ పేలి: ఆరుగురు కార్మికుల మృతి

- Advertisement -
- Advertisement -

Six dead in Explosion at Quarry Site in Karnataka

చిక్కబళ్లాపూర్(కర్నాటక): ఇక్కడకు సమీపంలోని ఒక గ్రామంలో ఉన్న గ్రానైట్ క్వారీలో ప్రమాదవశాత్తు జిలటిన్ స్టిక్స్ పేలి ఆరుగురు కార్మికులు మరణించారు. పెరెసండ్ర సమీపంలోని హీరేనాగవల్లి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. చిక్కబళ్లాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి కె సుధాకర్ హుటాహుటిన సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా తునాతునకలై చెల్లాచెదురుగా పడిఉన్నాయని ఆయన విలేకరులకు తెలిపారు.

ముఖ్యమంత్రి బిఎస్ ఎడియూరప్ప స్వస్థలం శివమొగ్గలోని ఒక క్వారీలో కూడా జనవరి 22న ఇటువంటి పేలుడే సంభవించి ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. జిలటిన్ స్టిక్స్‌ను విచ్చలవిడిగా ఉపయోగిస్తూ పేలుళ్లు జరుపుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో హీరేనాగవల్లిలోని క్వారీలో క్వారీని ఫిబ్రవరి 7న పోలీసులు నిలిపివేశారు. అయినప్పటికీ కొద్ది రోజులుగా రహస్యంగా క్వారీయింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఇటీవల క్వారీ కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. జిలటిన్ స్టిక్స్‌ను నిర్వీర్యం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Six dead in Explosion at Quarry Site in Karnataka

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News