Thursday, May 2, 2024

చరిత్ర సృష్టించిన మంధాన

- Advertisement -
- Advertisement -

Smriti Mandhana hit Century in Pink Ball Test

క్వీన్స్‌లాండ్:ఆస్ట్రేలియాతో జరుగుతున్న చారిత్రక పింక్ బాల్ టెస్టులో భారత ఓపెనర్ స్మృతి మంధాన అద్భుత శతకంతో చరిత్ర సృష్టించింది. భారత్‌ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరుగుతున్న డేనైట్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ మంధాన సెంచరీతో అదరగొట్టింది. ఈ క్రమంలో పింక్‌బాల్ టెస్టులో సెంచరీ సాధించిన తొలి భారత మహిళా బ్యాటర్‌గా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. టీమిండియా మహిళలకు ఇదే తొలి డేనైట్ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. క్వీన్స్‌లాండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌కు వరుసగా రెండో రోజు కూడా వరుణుడు ఆటంకం కలిగించాడు. అయితే భారత ఓపెనర్ మంధాన మాత్రం అసాధారణ బ్యాటింగ్‌ను రెండో రోజు కూడా కొనసాగించింది.

132/1 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం రెండో రోజు బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు మంధాన, పూనమ్ రౌత్ అండగా నిలిచారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఇక కెరీర్‌లోనే అత్యుత్తమ టెస్టు ఇన్నింగ్స్‌ను ఆడిన మంధాన 216 బంతుల్లో 22 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 187 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో శతకం సాధించి తొలి భారత మహిళా క్రికెటర్‌గా మంధాన అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇక మహిళల డేనైట్ టెస్టుల్లో కూడా భారత్‌కు ఇదే మొదటి శతకం కావడం విశేషం. అంతేగాక పూనమ్ రౌత్‌తో కలిసి మంధాన రెండో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పింది.

Smriti Mandhana hit Century in Pink Ball Test

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News