Tuesday, May 7, 2024

నామినేషన్‌ను ఉపసంహరించుకున్న బండ్ల గణేష్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈనెల 10న జరిగే ఎన్నికలలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. జనరల్ సెక్రటరీ పదవికి ఇటీవల నామినేషన్ వేసిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ లతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. “నా దైవ సమానులు, నా ఆత్మీయులు, నా శ్రేయోభిలాషుల సూచనల మేరకు నేను ‘మా’ జనరల్ సెక్రటరీ నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు.

Bandla Ganesh withdraws nomination

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News