Tuesday, August 5, 2025

ఎంత పని చేశావు నాగుపాము… రూ.50 లక్షల ఆస్తి నష్టం

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి: నాగుపాము చేసిన ఓ వస్త్ర వ్యాపారికి భారీ ఆస్తి నష్టం జరిగింది. పాము విద్యుత్ స్తంభం ఎక్కి రెండు తీగలను తాకడంతో షార్ట్ సర్క్యూట్ జరగడంతో వస్త్ర దుకాణం దగ్ధమైంది. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… టేకుమట్ల మండల కేంద్రంలో శ్రీనివాస్ అనే వ్యక్తి 15 ఏళ్లుగా వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు. దుకాణంపైన ఫోర్షన్‌లో తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఆదివారం రాత్రి దూకాణం మూసి ఇంటికి వెళ్లాడు.

దుకాణం పక్కన ఉన్న విద్యుత్ స్తంభంపైకి నాగుపాము ఎక్కింది. నాగుపాము తీగలను తాకడంతో షార్ట్ సర్క్యూట్ జరగడంతో దుకాణంలో మంటలు చెలరేగాయి. స్థానికుల సహాయంతో మంటలను ఆర్పడానికి ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే దుకాణంలో దుస్తులు, నగదు, ఫర్నీచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. స్తంభం పైనే పాము చనిపోయింది. రూ.50 మేర ఆస్తి నష్టం జరిగినట శ్రీనివాస్ వాపోయాడు. తనని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News