Friday, September 19, 2025

కలి పురుషుడు, అమ్మవారికి మధ్య జరిగే పోరాటం

- Advertisement -
- Advertisement -

సంధ్య ఫిలిం బ్యానర్‌పై రామ్ ప్రసాద్ గురజాడ, అంజలి, శ్రీకాంత్ పెరుమండ్ల, చిన్ని, రోజా రాణి, బివి సుబ్బా రెడ్డి నటీ నటులుగా టి.రాము దర్శకత్వంలో చందా లక్ష్మీ నారాయణ నిర్మించిన సోషియో ఫాంటసీ చిత్రం గాలి. ఈ చిత్ర టీజర్, సాంగ్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నిర్మాత సాయి వెంకట్, బల్లెం వేణు మాధవ్, తిరునగిరి శ్రీనివాస్, దరిపల్లి నవీన్ కుమార్ తదితరులు పాల్గొని మోడి జన్మదిన సందర్భంగా చిత్ర ఆడియో, టీజర్‌ను విడుదల చేశారు. అనంతరం చిత్ర నిర్మాత లక్ష్మి నారాయణ మాట్లాడుతూ “రాము రాసుకున్న సోషియో ఫాంటసీ కథ నచ్చడంతో ఈ సినిమా చేయడం జరిగింది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాము”అని అన్నారు. చిత్ర దర్శకుడు రాము మాట్లాడుతూ కలి పురుషుడుకి, అమ్మ వారికి మద్య జరిగే భీకర పోరాటమే ఈ ‘గాలి’ చిత్రమని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో లు రామ్ ప్రసాద్ గురజాడ, శ్రీకాంత్ పెరుమండ్ల, హీరోయిన్లు అంజలి, చిన్ని తో పాటు రోజా రాణి, వేణు, బల్లెం వేణుమాధవ్, జె.శ్రీనివాస్, బి.వి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Also Read :  ‘కిష్కింధపురి-2’ తప్పకుండా వస్తుంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News