Thursday, May 2, 2024

ఎపి నుంచి నగరానికి వచ్చే వారి కోసం ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

Special trains for those coming to Hyderabad from AP

ఎపి నుంచి నగరానికి వచ్చే వారి కోసం, ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే

హైదరాబాద్: పండుగ నేపథ్యంలో నగరాలన్నీ ఖాళీ అయ్యాయి. ప్రజలంతా తమ సొంత ఊర్లకు వెళ్లిపోయారు. పల్లెల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికుల కోసం మరిన్ని స్పెషల్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసింది. పండుగ ముగిసిన తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చే వారి కోసం ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. జనవరి 18న కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ (07458)తో పాటు మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే గురువారం ప్రకటించింది. కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ (07458) ప్రత్యేక రైలు కాకినాడ టౌన్ నుంచి 18న రాత్రి 08.40గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 08.45 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.

ఈ రైలు సామర్లకోట, అనపర్తి, రాజమహేంద్రవరం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, ఆకవీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది. నర్సాపూర్ – సికింద్రాబాద్ (07441) ప్రత్యేక రైలు 17న రాత్రి 8గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 06.05గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది. కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ (07457) ప్రత్యేక రైలు కాకినాడ టౌన్ నుంచి 17న సాయంత్రం 6గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 05.20 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుటుంది. ఈ రైలు సామర్లకోట, ద్వారపూడి, రాజమహేంద్రవరం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, ఖాజీపేట స్టేషన్లలో ఆగుతుంది.

Special trains for those coming to Hyderabad from AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News