Friday, May 3, 2024

ఐక్యతతో ఫాసిస్ట్ దాడులను ఎదురుకోవాలి

- Advertisement -
- Advertisement -

హన్మకొండ :- భారతదేశంలో హేతువాదులు, అంబెద్కర్ వాదులు, ప్రగతిశీలవాదులపై సనాతన ఫాసిస్ట్, ఆర్ ఎస్ ఎస్ మతోన్మాద శక్తులు చేస్తున్న దాడులు, హత్యలను ఐక్యతతో ఎదురుకోవాలని విముక్త చిరుతల కక్షి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జిలుకర శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ లో భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు, ఆజాద్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ పై ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి గుండాలు జరిపిన హత్యాయత్నాన్ని ఖండిస్తూ హన్మకొండ జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్లో గురువారం ప్రజా సంఘాలు చేసిన నిరసన కార్యక్రమంలో జిలుకర శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ఫాసిస్ట్, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా దేశ ప్రజలను చైతన్యం చేస్తున్న భీమ్ ఆర్మీ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ పై దాడి దేశ మూలవాసి ప్రజలందరిపై చేసినదిగా చూడాలని, ప్రశ్నించే గొంతుకలు, ప్రజాస్వామికవాధులపై బిజెపి చేస్తున్న మారణహోమాన్ని దేశ ప్రజలు కలసికట్టుగా ఎదుర్కోవాలని ఆయన అన్నారు.

అనంతరం బిసి స్టడీ ఫోరం వ్యవస్థాపక చైర్మన్ సాయిని నరేందర్ మాట్లాడుతూ.. బిజెపి అధికారంలో లేనప్పటి నుండే ప్రశ్నించే ప్రగతిశీలవాదులు, హేతువాదులు, అంబెడ్కర్ వాదులను హత్యలుచేస్తూనే ఉన్నారని, బిజెపి అధికారంలోకి వచ్చాక ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో హత్యలు మరింత పెరిగాయని అన్నారు. బహుజనులు మతోన్మాదుల ఉచ్చులోపడకుండా చైతన్యపరచాలని ప్రశ్నించే గొంతులు, ప్రగతిశీల, కమ్యూనిస్ట్ లు, బిజెపి, ఆర్ ఎస్ ఎస్ లను వ్యతిరేకించే శక్తులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిద్దెపాక ఎల్లయ్య, విసికె రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మచ్చ దేవేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెరుపల్లి ఆనంద్, రాష్ట్ర కార్యదర్శులు కొయ్యడ కిరణ్ కుమార్, అయిరబోయిన బిక్షపతి, విసికె హన్మకొండ జిల్లా అధ్యక్షుడు అంబాల అనిల్, వరంగల్ జిల్లా ఇంచార్జీ కన్నాల రవి, కాంగ్రెస్ నాయకురాలు సింగారపు అరుణ, డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్, ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవీందర్, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు పుట్ట రవి, సిపిఎం జిల్లా నాయకుడు చుక్కయ్య, కెయు జాక్ నాయకుడు మంద వీరస్వామి, మహాత్మ జ్యోతిరావ్ ఫూలే సామాజిక న్యాయవేదిక జిల్లా అధ్యక్షుడు కేడల ప్రసాద్, రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చాపర్తి కుమార్ గాడ్గె, బిఎల్‌ఎఫ్ వరంగల్ ఇంచార్జి ఐతం నగేష్, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు అంకేశ్వరపు రాంచంద్రరావు, విసికె హన్మకొండ జిల్లా నాయకులు తాళ్లపల్లి ప్రవీణ్, సుశీల్ భరత్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు అర్జున్, తెలంగాణ కొమురన్న, యాదవ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సిద్దారాజు యాదవ్, న్యాయవాదులు జె జె స్వామి, రాచకొండ ప్రవీణ్ కుమార్, కృష్ణంరాజు, తదితరులు పాల్గొని చంద్రశేఖర్ ఆజాద్ పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించి మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News