Sunday, April 28, 2024

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

సెన్సెక్స్ 107, నిఫ్టీ 26 పాయింట్లు క్షీణత

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఈ వారంలో వెలువడనున్న ఆర్‌బిఐ ద్రవ్య పరపతి విధానం సమీక్ష, అమెరికా ఉద్యోగ గణాంకాల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తత పాటించారు. దీంతో కొన్ని కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. అయితే పిఎస్‌యుబ్యాంక్స్, ఐటి షేర్లు రాణించడం కొంత మేర కలిసొచ్చింది.సెన్సెక్స్ ఉదయం66,048.81పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో మొదలైంది. ఆరంభంలో స్తబ్దుగా సాగింది. అయితే ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 65,752 66,057 పాయింట్ల మధ్య కదలాడింది.

Also Read: వంతెన కట్టకపోతే ఎన్నికల బహిష్కరణ

చివరికి 106.98 పాయింట్లు నష్టపోయి 65,846.50 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌సి నిఫ్టీ సైతం 26.45 పాయింట్లు నష్టపోయి 19,570.85 పాయింట్ల వద్ద స్థిరపడింది.మరో వైపు డాలరుతో రూపాయి మారకం విలువ 82.84గా ఉంది. సెన్సెక్స్‌లో టెక్ మహీంద్రా, విప్రో, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బిఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్. ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు రాణించాయి. పవర్ గ్రిడ్, మహింద్ర అండ్ మహింద్ర, జెఎస్‌డబ్లు స్టీల్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, సన్ నెస్లే, ఇండస్‌ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్, ఐటిసి షేర్లు నష్టపోయిన వాటిలో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News