Monday, April 29, 2024

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు భారత స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపాయి. అంతర్జాతీయంగా ఇజ్రాయెల్, ఈరాన్ టెన్షన్ కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపింది. సెన్సెక్స్ 845.12 లేక 1.13 శాతం పడిపోయి 73399.78 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 241.56 పాయింట్లు లేక 1.07 శాతం పడిపోయి 22277.85 వద్ద ముగిసింది. భారత-మారిషస్ ట్యాక్స్ ఒప్పందం, అమెరికా ద్రవ్యోల్బణం కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. నిఫ్టీలో ఓఎన్ జిసి, హిందాల్కో, మారుతి సుజుకీ, నెస్లే ఇండియా షేర్లు లాభపడగా, శ్రీరామ్ ఫైనాన్స్, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వీస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News