Thursday, August 7, 2025

అమ్మాయిలను అమ్మోరులా పెంచాలి

- Advertisement -
- Advertisement -

30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ మున్నా ధులిపూడి నుంచి వస్తున్న మరో చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. (Bad Girls) ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో రోహన్ సూర్య, మొయిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ మోషన్ పోస్టర్‌ను ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన గ్రాండ్ ప్రెస్‌మీట్‌లో దర్శకులు చందూ మొండేటి, శివ నిర్వాణ, కృష్ణ చైతన్య ముఖ్య అతిథులుగా పాల్గొని విడుదల చేశారు.

ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ “30 రోజుల్లో ప్రేమించడం ఎలా తర్వాత నేను మున్నాతో కలిసి వర్క్ చేస్తున్నా. ఈ సినిమా కూడా అద్భుతమైన చిత్రం (Excellent picture) అవుతుంది”అని పేర్కొన్నారు. డైరెక్టర్ మున్నా మాట్లాడుతూ.. ‘ఈ స్టోరీకి ఎంతోమంది అమ్మాయిల కథలు స్ఫూర్తినిచ్చాయి. అమ్మాయిలను పేరెంట్స్ భయంతో పెంచుతారు. అమ్మాయిలను భయంతో కాదు ధైర్యంతో పెంచాలి అని చెప్పే కథ ఇది. అమ్మాయిలను అమ్మోరులా పెంచాలి”అని అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రం, నాగేశ్వరరెడ్డి, మొయిన్, సూర్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News