Saturday, September 21, 2024

ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్ వసూళ్లను రాబట్టిన సినిమా ‘స్త్రీ 2’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  భారత స్వాతంత్ర్య దినోత్సవం నాడు విడుదలైన హిందీ చిత్రం ‘స్త్రీ 2’. ఇందులో శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమా తొలి రోజునే రికార్డు కలెక్షన్స్ రాబట్టిందని సమాచారం. మొదటి రోజునే రూ. 60 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వెబ్సైట్ ‘సాక్ నిల్క్’ పేర్కొంది. దీంతో ఈ ఏడాది హిందీ సినిమాలో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది.  విశేషం ఏమిటంటే ‘కల్కి 2898ఏడి(హిందీ) ఓపెనింగ్ డే వసూళ్లను కూడా ఇది అధిగమించింది. అంతేకాదు ఆల్ టాప్ 10 హిందీ సినిమా ఓపెనర్ల జాబితాలో ‘స్త్రీ 2’ స్థానం సంపాదించుకుంది.

‘స్త్రీ 2’ దెబ్బకు అక్షయ్ కుమార్ ‘ఖేల్ ఖేల్ మే’, జాన్ అబ్రహం ‘వేద’ సినిమాలు కూడా కుదేలయ్యాయి. అమర్ కౌశిక్ దర్శకత్వంలో కామేడీ హారర్ గా ఈ సినిమా తీశారు. ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి, అభిషేఖ్ బెనర్జీ, అపరశక్తి ఖురానా తదితరులు నటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News