Thursday, May 9, 2024

అపెండిక్స్ ఆపరేషన్ వికటించి విద్యార్థిని మృతి

- Advertisement -
- Advertisement -

Student died

 

మియాపూర్ : అపెండిక్స్ నొప్పితో ఆస్పత్రిలో చేరిన విద్యార్థిని శస్త్ర చికిత్స అనంతరం ఇన్‌పెక్షన్ కారణంగా మృతి చెందిన సంఘటణ మియాపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని మదీనగూడ అర్చన హాస్పిటల్ లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు మరియు కుటుంభ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పటాన్‌చెరు మండలం ఖర్ధనూర్ గ్రామానికి చెందిన పాండు కవిత దంపతులకు పూజిత (18), అరవింద్ ఇద్దరు పిల్లలు. తండ్రి పాండు చనిపోగా వారి తల్లి వ్యవసాయం మరియు కూలి పని చేసుకుంటు పిల్లలను పోషిస్తూ జీవనం సాగిస్తుంది. పూజిత మదీనగూడ లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ బైపిసి చదువుతుంది. ఈ నెల 26 న పూజితకు తీవ్ర కడుపునొప్పి రావాడంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రి కి తిసుకెళ్లారు.

అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు మదీనగూడ లోని అర్చన హాస్పిటల్ కు పంపించారు. అక్కడ వైద్యులు ఆమేకు వైద్య పరీక్షలు నిర్వహించి అపెండిక్స్ గా గుర్తించి వెంటనే ఆపరేషన్ చేయాలని కుటుంభ సభ్యులతో చెప్పగా వారి అంగీకారంతో ఆపరేషన్ చేశారు. శస్త్ర చికిత్స సమయంలో ఆమే కడుపులో అపెండిక్స్ గడ్డ పగిలి చీము చేరి అది ఇన్‌పెక్షన్ గా మారిందని దానిని శుభ్రం చేసామని వైద్యులు తెలిపారు. అనంతరం మల్లి స్కానింగ్ తీయాగా కడుపులో మల్లి చీము చేరి ఇన్‌పెక్షన్ గా మారిందని తిరిగి ఆపరేషన్ చేయాలని వైద్యులు కుటుంభ సభ్యులకు తెలుపగా రెండో సారి ఆపరేషన్ చేశారు.

తీవ్ర స్థాయిలో ఇన్‌పెక్షన్ కారణంగా పూజిత మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో చనిపోయిందని వైద్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం వలననే పూజిత చనిపోయిందని కుటుంభ సభ్యులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగి పూల కుండీలను ద్వంసం చేశారు. పరిస్థితిని తెలుసుకున్నా మియాపూర్ పోలిసులు సంఘటణ స్థలానికి చేరుకొని భారి బందోభస్తు ఏర్పాటు చేశారు. కుటుంభ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని సిఐ వెంకటేష్ తెలిపారు.

వైద్యుల నిర్లక్ష్యం వల్లే మా బిడ్డ చనిపోయింది..కుటుంభ సభ్యులు
రెండు సార్లు ఆపరేషన్ చేసిన వైద్యులు తమ బిడ్డను సరిగ్గా పట్టించుకోకుండా వారి నిర్లక్ష్యం వలనే తమ బిడ్డ చనిపోయిందని కుటుంభ సభ్యులు హాస్పిటల్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా కూతురు బాగా చదివి ఇంటికి పెద్ద దిక్కు అవుతుందని అనుకుంటే వైద్యుల నిర్లక్ష్యం నా కూతురు ప్రాణాలు కోల్పోయేట్టు చేశారని మృతురాలి తల్లి గుండెలు పగిలేల కన్నీటి పర్యాంతమైంది. తమ కూతురు తిరిగి రాని లోకాలకు వెల్లిందని మృతురాలి తల్లి, కుటుంభ సభ్యుల రోదనతో హాస్పిటల్ లోని ప్రతి ఒక్కరిని కలిచివేసింది.

మా తప్పేమి లేదు: డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి
అపెండిక్స్ తో చనిపోయిన పూజిత విషయంలో తమ తప్పేమి లేదని మృతురాలికి ఆపరేషన్ చేసిన డాక్టర్ పేర్కోన్నారు. కుటుంభ సభ్యులు ఆమేను ఆలస్యంగా తీసుకువచ్చారని అప్పటికే కడుపులో గడ్డ పగిలి ఇన్‌పెక్షన్ అయింందని, అయిన దానిని తొలగించి చికిత్సను అందించామని ఆయన తెలిపారు. రెండు సార్లు పరేషన్ చేసిన తరువాత తీవ్ర ఇన్‌పెక్షన్ తో పూజిత చనిపోయిందని ఆమే మృతి పట్ల వైద్యుల తప్పేమి లేదని ఆయన పేర్కోన్నారు.

Student died with Appendix operation fail
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News