Saturday, May 4, 2024

గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: గర్భస్థ, పిండ, లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్ట ప్రకారం నేరమని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రకాష్ అన్నారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ ఆదేశాల ప్రకారం.. నర్సంపేట పట్టణంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తన సిబ్బందితో కలిసి వేద, పావని, మమత, మల్లికా హాస్పిటల్స్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్ట ప్రకారం ప్రతీ స్కానింగ్ సెంటర్ నిర్వహించాలని, ఎవరైనా చట్ట వ్యతిరేకంగా పీసీపీఎన్‌డీటీ యాక్ట్‌కు వ్యతిరేకంగా బ్రూణ హత్యలు చేసినా, అనవసరమైన అబార్లన్లు చేసినా, అవసరంలేని సిజేరియన్ ఆపరేషన్లు చేసిన వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read :IPL 2023: చెన్నైపై బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు..

ప్రతీ ఆసుపత్రిలో గర్భస్థ పిండ లింగ నిర్దారణ చేయకుండా గర్భిణీ స్త్రీ, వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ద్వారా సమాజంలోని ఆడ, మగ బేధం లేకుండా చూడాలని అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ గర్బిణీ వివరాలు పొందుపర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ అనిల్‌కుమార్, సబ్ యూనిట్ ఆఫీసర్ నంద, ఆరోగ్య విద్యా బోధకురాలు మార్త తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News