Sunday, April 28, 2024

ఆరు గ్యారెంటీలపైనే తొలి సంతకం

- Advertisement -
- Advertisement -

ర్సంపేట: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు గ్యారంటీ పథకాలపై తొలిసంతకం చేస్తానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన రోడ్‌షోలో పాల్గొని కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. తెంగాణ ఏర్పాటు ప్రక్రియ సందర్భంగా ఎన్నో సమస్యలు వచ్చాయని అయినప్పటికీ అమ్మ సోనియమ్మ ఇక్కడి ప్రజల అభిష్టం మేరకు నిర్ణయం తీసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు ఫలితాలను ప్రజలు అనుభవించడం లేదని సిఎం కెసిఆర్ కుటుంబమే వాటి ఫలితాలను అనుభవిస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్, బిజెపి, ఎంఐఎం మూడు పార్టీలు ఒకటేనని పార్లమెంటులోను బిజెపికి బిఆర్‌ఎస్ సహకారం అందిస్తుందని ఆరోపించారు. ఈ దేశానికి వెన్నెముక అయిన రైతులకు మేలు చేసేందుకు అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలుచేస్తుందన్నారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా డిసెంబరు 9న మూడు గ్యారంటీలపై కాంగ్రెస్ ముఖ్యమంత్రి తొలి సంతకం చేస్తారన్నారు. మహిళలకు తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. నిరుద్యోగ సమస్య తీర్చిదిద్ది ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మహిళలకు ప్రతీ నెల రూ. 2500, రూ. 500లకే గ్యాస్ అందిస్తామన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో మ్యానిఫెస్టోలో ప్రకటించిన వాటన్నింటిని అమలుచేసి తీరుతామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు ఎకరాకు రూ. 15 వేలు, కౌలు రైతులకు రూ. 10 వేలు అందించి రైతులను ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. బీసీలకు రూ. 5 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ. 6 లక్షలు ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఈ సమావేశంలో నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దొంతి మాధవరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News