Monday, April 29, 2024

కాంగ్రెస్‌కు కళ్లెం!

- Advertisement -
- Advertisement -

నామినేషన్‌ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హీటెక్కింది. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అధికార బిఆర్‌ఎస్‌కు మిత్రపక్షమైన ఎంఐఎం తామెవరికి తీసిపోమంటూ ఎన్నికల ప్రచార స్పీడు పెంచింది. నవంబర్ 30న జరగనున్న ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవడంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే ఎజెండాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నట్లు మైనారిటీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎంఐఎం అధినేత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మిత్రపక్షం బిఆర్‌ఎస్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టా రు. ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేస్తున్న 9 స్థానాల్లో పాదయాత్రలు, కార్నర్ మీటిం గ్స్, బహిరంగ సభలు నిర్వహిస్తూనే వీలు దొరికినప్పడల్లా జిల్లాలోనూ ప్రచార సభల్లో పాల్గొంటున్నారు.

బిఆర్‌ఎస్‌కు మద్దతిస్తున్నా ఆ పార్టీతో కలిసి ప్రచారం నిర్వహించకుం డా ‘హాలాత్‌ఎ హాజరా’ పేరుతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎంఐఎం బహిరంగ సభలు నిర్వహిస్తోంది. ముస్లిం మైనారిటీల అభివృద్ధికోసం బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారాస్త్రంగా ఓవైసి ముస్లింలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముస్లిం జనా భా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఓవైసి ప్రచార సభలు ఉండేలా ఎంఐఎం కార్యాచరణను రూపొందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎంఐఎం పోటీ చేసే స్థానాల్లో పాదయాత్రలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్న ఓవైసి జిల్లాల్లో మాత్రం కేవలం బహిరంగ సభలతోనే సరిపుచ్చుకుంటున్నారు. ఇప్పటికే జహీరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్‌లలో జరిగిన బహిరంగ సభల్లో ఓవైసి బిఆర్‌ఎస్ అభ్య్రుర్థుల విజయం కోసం ప్రచారం నిర్వహించారు. జిల్లాల్లో దాదాపు 20 నుండి 30 సభలు నిర్వహించాలని ఎంఐఎం నిర్ణయించినట్లు తెలిసింది.

మైనారిటీల్లో మార్పు వచ్చిందా..?
రాష్ట్రంలో దాదాపు 13 శాతం ముస్లిం మైనారిటీ జనాభా ఉంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను దాదాపు 45 నియోజకవర్గాల్లో మైనారిటీ ఓటర్లు కీలకం కానున్నా యి. మొత్తానికి 13 శాతం ఉన్న ముస్లిం మైనారిటీ ఓటర్లు రాజకీయ పార్టీల భవితవ్యాన్ని నిర్ణయించబోతున్నాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ ముస్లిం మైనారిటీ ఓటర్లు వెన్నుదన్నుగా నిలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆ పరిస్థితి పునరావృత్తం అవుతుందా అంటే అనుమానంగానే కనిపిస్తోంది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో దాదాపు 90 శాతం ముస్లిం మైనారిటీ ఓటర్లు కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. దీంతో కర్ణాటకలో కాంగ్రెస్ విజయదుంధుభి మోగించింది. దాని ప్రభావం తెలంగా లో ఉంటుందని భావిస్తున్నారు.

కాంగ్రెస్ ముస్లిం డిక్లరేషన్ పేరుతో మైనారిటీలను తిరిగి తమ వైపు ఆకర్శించేందుకు ప్రయత్నిస్తోంది. కర్ణాటక మోడల్‌గా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ వైపు ముస్లిం మైనారిటీలు ఆకర్షితులు కాకుండా ఎంఐఎం ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతూనే బిఆర్‌ఎస్ ప్రభు త్వం మైనారిటీల అభ్యున్నతి కోసం చేపట్టిన పథకాలను పదేపదే వల్లిస్తోంది. ఎంఐఎం పాతబస్తీలోని 7 సిట్టింగ్ స్థానాలతో పాటు అదనంగా జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్‌లలో పోటీ చేస్తోంది. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పా టు చేసిన మైనారిటీ గురుకులాల వల్ల 97 వేల మంది మైనారిటీ విద్యార్థులు ఉచితం గా విద్యనభ్యసిస్తున్నారు. ఇందుకు గాను ప్రభుత్వం ఏడాదికి రూ.3,065 కోట్లు వెచ్చిస్తోంది. దీనిని ఎంఐఎం ప్రచారాస్త్రంగా చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News