Saturday, April 27, 2024

మణిపూర్‌లో రెండో రోజూ కొనసాగుతున్న విద్యార్థుల నిరసన

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జులైలో ఆచూకీ లేకుండా పోయిన మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు చనిపోయినట్టు ఫోటోలు బయటపడిన సంగతి తెలిసిందే. సాయుధ మూకల చేతిలో వారు హత్యకు గురైనట్టు తేలింది.

వారి మృతదేహాల ఫోటోలు ఇంటర్నెట్‌పై ఆంక్షలు ఎత్తివేయడంతో వెలుగు లోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. రాష్ట్రంలోని విద్యార్థుల ఘటనకు నిరసనగా మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇంఫాల్‌లో వందలాది మంది విద్యార్థులు తమ నిరసన కొనసాగిస్తున్నారు. బుధవారం కూడా ఈ నిరసనలు కొనసాగాయి. ఇంఫాల్ వీధుల్లో విద్యార్థుల మృతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు.

దీంతో భద్రతా బలగాలు అడ్డుకొని లాఠీఛార్జీ, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో 50 మందికి పైగా విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ప్రభుత్వం మళ్లీ అక్టోబర్ 1 వరకు నిషేధం విధించింది. రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను శుక్రవారం వరకు మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News