Tuesday, May 21, 2024

సర్వర్ సమస్యకు చెక్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: సర్వర్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నేటి నుంచి పూర్తిస్థాయిలో పనిచేయనున్నాయి. ఆరు రోజులుగా పెండింగ్‌లో ఉన్న స్లాట్‌లకు నేటి నుంచి మోక్షం కలగనుంది. సర్వర్ లో సమస్యలతో ఐదు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ సడలింపు నేపథ్యంలో గత నెల 31వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌లు ప్రా రంభమయిన నేపథ్యంలో రెండు రోజులు మాత్రమే రిజిస్ట్రేషన్ల ప్రక్రి య సజావుగా సాగింది. అనంతరం ఈనెల 02వ తేదీ నుంచి సబ్ రిజిస్ట్రార్ లాగిన్‌లోని కార్డు అప్లికేషన్ ఓపెన్ కాలేదు. రాష్ట్ర మంతా రిజిస్ట్రేషన్‌కు సంబంధించి అనేక సమస్య లు ఉత్పన్నం కావడంతో టెక్నికల్ టీంలు గచ్చిబౌలి డేటా సెంటర్‌లోని (ఎస్‌డిసి)లోని ప్రధాన సర్వర్ నెట్‌వర్క్‌లో సాంకేతిక సమస్యను గుర్తించాయి. అప్పటి నుంచి దీన్ని సరిచేయడానికి టెక్నికల్ టీం చేసిన ప్ర యత్నాలు ఫలించలేదు. అయితే రెండు రోజులుగా ఇక్కడ చేసిన మ రమ్మతులతో కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నెట్‌వర్క్ సమస్య తీ రినా మరికొన్ని చోట్ల ఈ సమస్య అ లాగే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఆదివారం డిఐజి సుభాషిణి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్‌లు కార్యాలయాలకు వెళ్లి తమ కార్యాలయాల్లో నెలకొన్న ఇబ్బందులను టెక్నికల్ టీంలతో పంచుకున్నారు.

ఆదివారం మధ్యాహ్నానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నెట్‌వర్క్ సమస్య పూర్తిగా సమసిపోయిందని సబ్ రిజిస్ట్రార్‌లు పేర్కొనడంతో ఇన్ని రోజులుగా నెలకొన్న సర్వర్ సమస్యకు తెరపడింది. ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో 900లు మాత్రమే ఐదు రోజులుగా పలుచోట్ల నిలిచిపోయిన రిజిస్ట్రేషన్‌లు నేటి నుంచి షురూ కానున్నాయి. ఇన్ని రోజులుగా పెండింగ్‌లో ఉన్న స్లాట్‌లతో పాటు ప్రతిరోజు బుక్ చేసుకునే 24 స్లాట్‌లకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌లను కూడా నేటి నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పూర్తి చేయాలని సబ్ రిజిస్ట్రార్‌లు నిర్ణయించారు. అందులో భాగంగా ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 50 నుంచి 80 రిజిస్ట్రేషన్‌లు జరిగే అవకాశం ఉందని సబ్ రిజిస్ట్రార్‌లు పేర్కొంటున్నారు. మాములుగా ప్రతిరోజు సగటున రాష్ట్ర వ్యాప్తంగా 3,500లకు పైగా రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో 900 వరకు జరుగుతున్నాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తెలిపారు.
సాప్ట్‌వేర్ స్లోగా ఉండడంతో రిజిస్ట్రేషన్‌లను చేయలేకపోయాం
ఐదు రోజులుగా సర్వర్ ప్రాబ్లమ్‌తో ఎండార్స్‌మెంట్ ప్రింటింగ్ రాలేదు, రిపోర్టింగ్ జనరేటింగ్ కాలేదు. సిసిఏ (సెంట్రలైజ్డ్ కార్డు ఆర్కిటెక్చర్) సాప్ట్‌వేర్ స్లోగా ఉండడంతో రిజిస్ట్రేషన్‌లను చేయలేకపోయాం. ఆదివారం డిఆర్ స్థితప్రజ్ఞతో పాటు డిఐజి సుభాషిణి ఆదేశాల మేరకు కార్యాలయాలని వచ్చాం. మా ఆఫీసులో తలెత్తిన సమస్యలను టెక్నికల్ టీంతో పంచుకున్నాం. మధ్యాహ్నానికి పూర్తిస్థాయిలో టెక్నిలక్ టీం మా సమస్యను పరిష్కరించారు.
-బి.బలరాం, అబ్ధుల్లాపూర్‌మెట్, సబ్ రిజిస్ట్రార్

Sub Registrar Offices will open after 6 days in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News