Sunday, April 28, 2024

మట్టిని రక్షిద్దాం

- Advertisement -
- Advertisement -

Support for the Save Soil movement

సేవ్ సాయిల్ ఉద్యమానికి మద్దతు

సిఎం కెసిఆర్ స్ఫూర్తితోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌తో 24శాతం ఉన్న
అటవీ పెరిగింది ఐదో సంవత్సరంలోకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్
రహితంగా మార్చాం కోసం మనం’ ఈవెంట్‌లో ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్/కొండాపూర్ : సిఎం కెసిఆర్ స్ఫూర్తితోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించినట్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. ‘సేవ్ సాయిల్’ ఉద్యమానికి ఆయన మద్దతుగా నిలిచారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్, మట్టిని రక్షించు ఉద్యమంతో కలిసి మట్టి క్షీణత అనే క్లిష్టమైన సమస్యపై అవగాహన తీసుకురావడానికి శిల్పారామం రాక్ హైట్స్‌లో ‘మట్టి కోసం మనం’ లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ హాజరయ్యారు. ఈ లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ లో టాలీవుడ్ సింగర్స్ రామ్ మిరియాల, మంగ్లీ, సాహితీ చాగంటి, రమ్య బెహ రా, సందీప్, శ్రీ లలిత పాటల రూపంలో మట్టి విలువ జ నాలకు అర్థమయ్యేలా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపి సంతోష్ కుమార్ ఈ అద్భుత కార్యక్రమం పై తన స్పందన తెలియజేశారు.

‘సిఎం కెసిఆర్ 25 సంవత్సరాలుగా మొక్కలు పెంపకంపై అవగాహన కల్పిస్తూ సేవ్ సాయిల్ ఉద్యమానికి మద్దతుగా ఉన్నారు. సిఎం కెసిఆర్ స్ఫూర్తితోనే గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రారంభించాను. హరితహారం, గ్రీన్‌ఇండియా చాలెంజ్‌తో 24 శా తం ఉన్న తెలంగాణ అటవీ శాతం ఇప్పుడు 33 శాతానికి పెరిగింది. నేను ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మరింత ముందుకు తీసుకెళ్తున్న మీకు అందరికి ధన్యవాదాలు. గ్రీన్ ఇండియా చాలెంజ్ 5వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. దాంతో నా వంతు సాయంగా సేవ్ సాయిల్ ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తాగునీరు, సాగునీరుకు ఇబ్బంది ఉండేది. కానీ రాష్ట్రం వచ్చాక 8 ఏండ్లలో సాగునీరు తాగునీరు ఇబ్బందులు పూర్తిగా తొలిగిపోయాయి. నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ రహితంగా మార్చా ము. కనురెప్ప తీసి వేసే వరకు ఒక ఎకరం నిస్సారవంతంగా మారుతుందని లెక్కలు చెబుతున్నాయి, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది’ అంటూ ఎంపి సంతోష్ వ్యాఖ్యానించారు.

మట్టికి మొక్కలకు మధ్య ఎంత సన్నిహిత సంబంధం ఉందొ మట్టిని రక్షించు ఉద్యమానికి, తానూ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమానికి కూడా అలాంటి సంబంధం ఉందన్నారు. మొక్కలు నాటాలన్న, నాటిన మొక్కలు మహా వృక్షాలుగా మారాలన్న అది సారవంతమైన మట్టి ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్, సేవ్ సాయిల్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, మట్టిని కాపాడుకుంటే మన తరాలను కాపాడినవారమవుతామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎంపి సంతోష్‌తో పాటు పలువురు సేవ్ సాయిల్ వాలంటీర్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. రెండు తెలుగు రాష్టాల్లో 5000 కిలోమీటర్లు సైక్లింగ్ చేసిన వెన్నెల కు, తెలంగాణ ర్రాష్ట్రంలో 27 జిల్లాలో సైక్లింగ్ చేసిన నాగరాజు, నాగోల్ నుండి నాగార్జునసాగర్ వరకు స్కెటింగ్ చేరిన 7 సంవత్సరాల సుహాస్ కు మొక్కలతో పాటు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పద్మశ్రీ వెంకటేశ్వరరావు, రైతు నేస్తం , ఎన్నో ప్రశంసలు అందుకున్న ఆర్గానిక్ రైతు నాగరత్నం నాయుడు పాల్గొన్నారు.

సద్గురు ప్రారంభించిన ప్రపంచ ఉద్యమం మట్టిని రక్షించు..

మట్టి ఆరోగ్యం కోసం పాటుపడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా మట్టి సంక్షోభాన్ని పరిష్కరించడానికి సద్గురు ప్రారంభించిన ప్రపంచ ఉద్యమం మట్టిని రక్షించు. సాగు చేయదగిన నేలలో సేంద్రియ పదార్థాలను పెంచడానికి జాతీయ విధానాలు మరియు చర్యలను, అన్ని దేశాల నాయకుల మద్దతు తీసుకురావడమే ఈ ఉద్యమ ముఖ్య ఉద్దేశం. మట్టి కోసం సద్గురు చేస్తున్న ఈ ప్రయాణం ఇప్పుడు 29 వ తేదీన భారతదేశాన్ని చేరుకోబోతున్నారు. సద్గురు యూరోప్ మరియు మిడిల్ ఈస్ట్‌లోని 26 దేశాలలో ప్రయాణించిన తర్వాత భారతదేశానికి చేరుకుంటున్నారు. భారతదేశంలోని 9 రాష్ట్రాల్లో తన బైక్ రైడ్‌ను సద్గురు కొనసాగించనున్నారు. సద్గురు హైదరాబాద్‌కు జూన్ 15 న చేరుకోబోతున్నారు. వ్యవసాయ భూముల్లో కనీసం 3-6 శాతం సేంద్రీయ పదార్థాలు ఉండేలా ప్రభుత్వాలను కోరడం ఈ ఉద్యమం యొక్క ప్రాథమిక లక్ష్యం. ఇది లేకుండా, అన్ని వ్యవసాయ నేలలు వేగంగా క్షీణించి ఇసుకగా మారుతాయి, దీనిలో ఆహార పంటలు పెరగవు, ప్రపంచ ఆహార మరియు నీటి భద్రతకు ముప్పు వాటిల్లుతుంది.

ప్రపంచ జనాభా 9 బిలియన్లు దాటినా 2045 నాటికి ఆహార ఉత్పత్తిలో ఎడారీకరణ 40 శాతం తగ్గుదలకి దారితీస్తుందని యుఎన్ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఒ) హెచ్చరించింది. యుఎన్‌సిసిడి ప్రకారం, భూమి క్షీణత ప్రస్తుత రేటులో కొనసాగితే, 2050 నాటికి గ్రహం యొక్క 90 శాతం ఎడారిగా మారవచ్చు. – ఇప్పటి నుండి మూడు దశాబ్దాల కన్నా తక్కువ. మట్టిని రక్షించు ఉద్యమానికి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్ (యుఎన్‌సిసిడి) సహా వివిధ ప్రపంచ సంస్థలు మరియు ఏజెన్సీలు మద్దతు ఇస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యుఎన్‌ఇపి), ఫెయిత్ ఫర్ ఎర్త్, యుఎన్‌ఇపి చొరవ, ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్లూఎఫ్‌పి), ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయుసిఎన్).

ఆయన ప్రయాణం ప్రారంభించిన మొదటి 50 రోజులలో, ఉద్యమం ఇప్పటికే 2 బిలియన్లకు పైగా ప్రజలను చేరింది. 74 దేశాలు మట్టిని రక్షించెందుకు చర్య తీసుకోవడానికి అంగీకరించాయి. 7 కరేబియన్ దేశాలు, అజర్‌బైజాన్, రొమేనియా, యుఎఇలతో సహా అనేక దేశాలు నేలను కాపాడే విధానాలను రూపొందించడానికి ‘మట్టిని రక్షించు ‘తో అవగాహన ఒప్పందాలపై (ఎంవోయులు) సంతకం చేశాయి. 54 కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్, యూరోపియన్ యూనియన్, అనేక పాన్-యూరోపియన్ సంస్థలు, ముస్లిం వరల్ లీగ్ కూడా సేవ్ సాయిల్ ఉద్యమానికి మద్దతుగా ముందుకు వచ్చాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News