Thursday, May 2, 2024

మరాఠా మాజీ మంత్రికి ఊరట.. బెయిల్ పొడిగించిన సుప్రీం

- Advertisement -
- Advertisement -

ముంబై : మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత నవాబ్ మాలిక్‌కు సుప్రీం కోర్టు ఊరట కల్పించింది. ఈ కేసులో మధ్యంతర బెయిల్‌ను మరో ఆరు నెలలు పొడిగించింది. ఈడీ తరఫున కోర్టుకు హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు బెయిల్‌పై ఎలాంటి అభ్యంతరం తెలపక పోవడంతో ధర్మాసనం బెయిల్‌ను పొడిగించింది.

ఇంతకు ముందు ఆయనకు ఆరోగ్యసమస్యల నేపథ్యంలో వైద్యం చేయించుకోడానికి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇంతకు ముందు అక్టోబర్ 12న మూడు నెలలు పొడిగించింది. మనీలాండరింగ్ కేసులో వైద్యం చేయించుకునేందుకు బాంబే హైకోర్టును ఆశ్రయించగా, గత ఏడాది జులై 13న బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు.

మాలిక్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నానని, వైద్యం చేయించుకొనేందుకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీంతో కోర్టు గత ఏడాది ఆగస్టు 11న రెండు నెలలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం, అతని అనుచరుల కార్యకలాపాలకు సంబంధించిన కేసులో ఈడీ 2022 ఫిబ్రవరిలో నవాబ్‌మాలిక్‌ను అరెస్టు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News