Sunday, April 28, 2024

ఆప్ కార్యాలయం ఖాళీ చేయాల్సిందే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ తన పార్టీ కార్యాలయాన్ని ఖాళీ యేసేందుకు ఇచ్చిన గడువును ఈ ఏడాది జూన్ 15 వరకు సుప్రీంకోర్టు పొడిగించింది. రూస్ అవెన్యూలోని ఆప్ కార్యాలయం ఉన్న స్థలాన్ని మౌలిక వసతుల విస్తరణ కోసం ఢిల్లీ హైకోర్టుకు ప్రభుత్వం కేటాయించింది. తన కార్యాలయాలకు అవసరమైన స్థలం కోసం ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీసును సంప్రదించాలని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆప్‌కు సూచించింది.

నాలుగు వారాలలోగా ఆప్ దరఖాస్తును పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని తాము ఆ క్రార్యాలయాన్ని ఆదేశిస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఆప్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదన వినిసితూ ఏశంలోని ఆరు జాతీయ పార్టీలలో ఆప్ ఒకటని తెలిపారు. జానీయ పార్టీగా గుర్తింపు ఉన్న తమకు అన్యాయం జరుగుతోందని ఆయన చెప్పారు. బాదర్‌పూర్‌లో తమకు స్థలం ఇచ్చారని, కాని ఇతర పార్టీలన్నీ మెరుగైన ప్రదేశాలలో ఉన్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని కార్యాలయాన్ని ఖాళీ చేయడానికి జూన్ 15 వకు వ్యవధి ఇవ్వాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News