Sunday, April 28, 2024

నివేదిక ఇవ్వడం నేరమెలా అవుతుంది?: సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మణిపూర్ హింసపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా( ఇజిఐ) కమిటీ నివేదికకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.కమిటీలోని సభ్యులపై మణిపూర్ ప్రభుత్వం దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ప్రస్తావించిన సుప్రీం ధర్మాసనం.. ఇరు వర్గాల మధ్యశత్రుత్వాన్ని ప్రోత్సహించేదిగా ఏమీ కనిపించడం లేదని అభిప్రాయపడింది. కేవలం నివేదిక ఇవ్వడం నేరంగా ఎలా పరిగణిస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేసిన సిజెఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వారిపై చర్యలు తీసుకోకుండా ఇచ్చిన రక్షణను మరో రెండువారాలు పొడిగించింది. అంతేకాకుండా ఎఫ్‌ఐఆర్‌ను ఎందుకు రద్దు చేయకూడదని పేర్కొంటూ ఫిర్యాదుదారు స్పందనను కోరింది.

మణిపూర్‌లో హింస సందర్భంగా ఆ రాష్ట్రంలోని ప్రచార సాధనాలు అనుసరించిన వైఖరిపై ఎడిటర్స్ గిల్డ్ నిజనిర్ధారణ కమిటీని వేసింది.హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో పర్యటించిన నలుగురు సభ్యుల కమిటీ ఓ నివేదిక విడుదల చేసింది. అయితే ఆ నివేదిక ప్రజలను రెచ్చగొట్టేదిగా ఉందని పేర్కొంటూ మణిపూర్‌కు చెందిన ఓ మాజీ ఇంజనీర్, మరో వ్యక్తి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. వాటిపై పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అయితే ఆ ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలంటూ ఎడిటర్స్ గిల్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో గత నెలలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ నెల 15 దాకా రక్షణ కల్పించగా తాజాగా మరోసారి పొడిగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News