Sunday, June 16, 2024

సోరెన్‌కు సుప్రీం కోర్టు చీవాట్లు

- Advertisement -
- Advertisement -

మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీం కోర్టు బుధవారం నిరాకరించింది. కేసు ప్రాథమ్యంపై కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సోరెన్ న్యాయవాదుల బృందం పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. న్యాయమూర్తులు దీపంకర్ దత్తా, సతీష్ చంద్ర శర్మతో కూడిన వెకేషన్ బెంచ్ సోరెన్ న్యాయవాదులను మందలిస్తూ, వారు వాస్తవాలను నొక్కిపెట్టారని, ‘పరిశుద్ధ చేతులతో’ కోర్టుకు రాలేదని పేర్కొన్నది. తనపై గల అభియోగాలను ట్రయల్ కోర్టు ఇప్పటికే పరిగణనలోకి తీసుకున్నదని వెల్లడించకుండా అరెస్టును సవాల్ చేస్తూ ఒక పిటిషన్, బెయిల్ కోరుతూ మరొక పిటిషన్ అలా రెండు పిటిషన్లను సోరెన్ దాఖలు చేసినందున ఆయన అప్పీల్‌ను పరిశీలించరాదని బెంచ్ నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News