Saturday, April 20, 2024

విడాకులకు నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించరాదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కీలక తీర్పు నేపథ్యంలో ధర్మాసనం మరో విషయాన్ని స్పష్టం చేసింది. వివాహ బంధం కుదరదని తేల్చుకున్న దంపతులు నేరుగా విడాకుల కోసం సుప్రీంకోర్టు లేదా హైకోర్టులను ఆశ్రయించేందుకు వీలు లేదని తెలిపింది. ఆర్టికల్ 32 పరిధిలో సుప్రీంకోర్టుకు, ఆర్టికల్ 226 పరిధిలో హైకోర్టుకు వెళ్లడానికి వీల్లేదని, వివాహ విచ్చిత్తిని తెలిపి విడాకులు నేరుగా కోరేందుకు వీల్లేదని పేర్కొంది. ముందుగా సంబంధిత ట్రిబ్యునల్ లేదా సమస్యల పరిష్కారవేదికలను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఇంతకు ముందటి ద్విసభ్య ధర్మాసనం తీర్పుతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. ఇక విడాకుల క్రమంలో పిల్లలపై హక్కులు, న్యాయప్రకారం అందాల్సిన భరణం, ఆర్థిక సాయం వంటి వాటిపై కూడా తీర్పులో వివరాలు పొందుపర్చారు.

దంపతుల మధ్య వివాహ బంధం ఇక కోలుకోలేని రీతిలో విచ్ఛిన్నం అయితే, ఎడముఖం పెడముఖంగా ఉన్న ఇద్దరి మధ్య సయోధ్య ఎంతకూ వీలు కాబోదని తేలితే వారికి వెంటనే న్యాయస్థానాలు విడాకులు మంజూరు చేయవచ్చు. ఆరునెలలు వేచి ఉండే ప్రక్రియ లేకుండా విడాకులు జారీ చేయవచ్చు. ఈ మేరకు న్యాయస్థానాలకు రాజ్యాంగంలోని 142(1) అధికరణ మేరకు న్యాయస్థానాలకు ఉన్న విశేషాధికారాలను వాడుకునే వీలుందని సుప్రీంకోర్టు పేర్కొంది. విడాకుల వ్యాజ్యంపై ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. ఇక కలిసి ఉండే పరిస్థితి లేదని నిర్థారణ అయిన దంపతుల విషయంలో వెంటనే విడాకుల మంజూరీకి వీలుంది.

హిందూ వివాహచట్టం 1955లో ఉన్న ఆరు నెలల వరకూ విడాకులకు ఆగాల్సిన పని లేదని పేర్కొన్న సుప్రీంకోర్టు కొన్ని షరతులతో ఈ ఆరు నెలల నిరీక్షణ పరిధిని ఎత్తివేస్తూ వెంటనే విడాకుల మంజూరీకి దిగవచ్చునని తెలిపింది. ఆరు నెలలు ఆగి ఉండాలనే నిబంధనను సడలిస్తున్నట్లు తీర్పులో పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 పరిధిలో ఈ విధంగా తక్షణ విడాకుల మంజూరీకి కోర్టులకు విస్తృతాధికారాలు ఉన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని తీర్పు వెలువరిస్తున్నట్లు న్యాయమూర్తి ఎస్‌కె కౌల్ సారధ్యపు ధర్మాసనం తీర్పు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News