Thursday, May 2, 2024

ప్రకృతిని రక్షించుకుందాం

- Advertisement -
- Advertisement -

ఎన్‌ఆర్‌ఐ శుష్మునరెడ్డి

Sushma reddy plant tree in London

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రకృతి పట్ల ఎంపి సంతోష్‌కుమార్ చొరవ చాలా గొప్పదని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ మహిళా నాయకురాలు శుష్మునరెడ్డి కొనియాడారు. భవితరాలకు మంచి వాతావరణాన్ని అందించేందుకు ఆయన సంకల్పించిన గ్రీన్ ఇండియా అద్బుతంగా ముందుకు సాగుతుందన్నారు. తన జన్మదినం సందర్బంగా ఎన్‌ఆర్‌ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ఛాలెంజ్ మేరకు ఆమె ఆదివారం లండన్ సమీపంలోని రీడింగ్ నగరంలో తన నివాసం వద్ద మొక్కను నాటారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ..ప్రకృతిని కాపాడుకోవడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఎంపి సంతోష్‌కుమార్ తలపెట్టిన ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యులైనందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. అనంతరం తన మిత్రులకు, శ్రేయోభిలాషులను కూడా మొక్కలు నాటాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించడమే కాకుండా యూకేలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్న శుష్మనకు అభినందనలు తెలుపుతున్నానని అనిల్ కూర్మాచలం అన్నారు. అంతేగాక ఉద్యమసమయంలోనూ ఆమె లండన్ వీధుల్లో పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు అనిల్ గుర్తుచేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News