Monday, May 13, 2024

మినీ గురుకులాల కాంట్రాక్టు ఉద్యోగులకు తీపి కబురు

- Advertisement -
- Advertisement -

వేతనాలను 30 శాతం పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ
హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ మినీ గురుకులం ఉద్యోగుల సంఘం

మన తెలంగాణ / హైదరాబాద్ : గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 29 మినీ గురుకులాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఆర్థిక శాఖ తీపి కబురు చెప్పింది. సుమారు 418 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను 2024 మార్చి 31 వరకు కొనసాగిస్తూ వేతనాలను 30 శాతం పెంచుతూ ఆర్థిక శాఖ సహాయ కార్యదర్శి హరిత ఈ మేరకు జిఓ నెం. 1407 ను విడుదల చేశారు.

జిఓ విడుదల పట్ల తెలంగాణ మినీ గురుకులం ఉద్యోగుల సంఘం (టిఎస్ యుటిఎఫ్ అనుబంధం) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమావత్ జ్యోతి, బాణోత్ లక్ష్మి, ఉపాధ్యక్షులు కవిత, అనూష ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో హర్షం ప్రకటించారు. వేతనాల పెంపుదల చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు , గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు , కార్యదర్శి నవీన్ నికోలస్‌కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి , టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య , చావ రవిలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News