Monday, April 29, 2024

పెద్దపేగు క్యాన్సర్ లక్షణాలు.. నివారణ మార్గాలు

- Advertisement -
- Advertisement -

పెద్దపేగు క్యాన్సర్ ఉన్నవారికి ప్రధాన లక్షణం మలద్వారం నుంచి రక్తస్రావం. కొన్ని రోజులు విపరీతమైన మలబద్దకం. కొన్ని రోజులు విరేచనాలు కూడా అవుతుంటాయి. పొట్టకింద నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు ఉంటాయి. రక్తం వల్ల మలం ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. మలవిసర్జన చేసేటప్పుడు నొప్పి, బలహీనత, అలసట కనిపిస్తాయి. శరీరం బరువు తగ్గుతుంది. ఈ లక్షణాలు కనిపించగానే వైద్యుల్ని వెంటనే సంప్రదించాలి. పీచు పదార్ధాలు లేని జంక్‌ఫుడ్ తినడం అతిగా ఆల్కహాలు తీసుకోవడం, శారీరక శ్రమ లేక పోవడం, తదితర అవలక్షణాల వల్ల ఈ వ్యాధి మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. డయాబెటిస్ రోగుల్లోనూ ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ.

నివారణ మార్గాలు…
పెద్దపేగు క్యాన్సర్ నివారణ మార్గాల్లో ఆహారం కీలక పాత్ర వహిస్తుంది. తాజా ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో పీచు ఉంటుంది. రెడ్‌మీట్ వంటి మాంసాహారం తగ్గించి, చికెన్, చేపలు తీసుకోవడం మంచిది. పొగతాగడం, మద్యపానం మానేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News