Sunday, April 28, 2024

వంటగ్యాస్‌లో పన్నుల మంటలు !

- Advertisement -
- Advertisement -

అసలు ధర రూ.545..పన్నుల భారం రూ.485
రాష్ట్రంలో 1.18కోట్ల కుటుంబాలపై పన్నుల భారం

Tax fires on cooking gas

మనతెలంగాణ/హైదరాబాద్:  వంటగ్యాస్‌లో అసలు మంట కంటే ప్రభుత్వం ప్రజలపై బాదుతున్న పన్నుల మంటలే అధికంగా ఉంటున్నాయి. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వేస్తున్న పన్నులు వినియోగదారలకు మోయలేని భారమవుతున్నాయి. కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడేళ్ల కాలంలో మోడి సర్కారు సిలిండర్ ధరలను రెట్టింపుకంటే అధికంగానే పెంచివేసింది. 2014లో గ్యాస్ సిలెండర్ ధర రూ.470 ఉండగా, దీన్ని ప్రతిఏటా పెంచూతూనే వస్తోంది. 2017నాటికి రూ.646, 2020నాటికి రూ.910 పెంచిన ప్రభుత్వం 2020నాటికి తాజాగా సిలిండర్ ధరను రూ.1030కి చేర్చింది. వినియోగదారులు గ్యాస్ సిలిండర్‌కు చెల్లిస్తున్న ధరలో గ్యాస్ అసలు ధరకంటే ప్రభుత్వం వసూలు చేసుకుంటున్న పన్నుల ధరలే అధికంగా ఉన్నట్టు వినియోగదారులు చెబుతున్నారు.

వంట గ్యాస్ అసలు ధర రూ.545 ఉండగా, కేంద్ర ప్రభుత్వంవ దీనిపైన పన్నుకింద రూ.24.75 , రవాణా చార్జీకింద రూ.10 వసూలు చేస్తోంది. దీంతో కేంద్ర స్థాయిలోనే సిలిండర్ ధర 579.75కు చేరుకుంటోంది.ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతుగా సిలిండర్ ధరలో పన్నుల వాటాలు పిండుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పన్నుల వాటా రూ.291.36, రవాణా చార్జీకింద రూ.25, డీలర్ కమీషన్ కింద రూ9.50, సబ్సిడి రూ.40.57 వసూలు చేస్తోంది. గ్యాస్‌ఏజెన్సీల నుంచి డెలివరి బాయిస్ చార్జీకింద రూ.23.82వసూలు చేస్తున్నారు. కొన్ని చోట్ల అదనంగా రూ.30నుంచి రూ.50 వసూలు చేస్తున్నట్టు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. సిలిండర్ అసలు ధర .545కాగా , ప్రభుత్వం విధించేపన్నులు రవాణా చార్జీలు , డీలర్ల కమీషన్, డెలివరి బాయిస్ చార్జీలు కలిపి సిలిండర్ అసలు ధరకు అదనంగా రూ.485 వినియోగదారుల చెల్లించాల్సి వస్తోందంటున్నారు.

రాష్ట్రంలో 1.18కోట్ల కుటుంబాలపై ధరల మంటలు:

చీటికి మాటికి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతుండటం అన్ని వర్గాల వినియోదారలుకు భారంగా మారింది. రాష్ట్రంలో 1.18కోట్ల గృహ అవసరాలకు గ్యాస్ సిలిండర్లను వినియోస్తున్నారు. అన్ని కంపెనీలు కలిపి రోజుకు 1.20లక్షల వంటగ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నాయి. దేశంలో 5రాష్ట్రాల ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.50పెంచింది. దీంతో రాష్ట్రంలోని వంటగ్యాస్ వినియోగదారులపైన పెరిగిన అదనపు ధరల భారం కూడా రోజు 50లక్షల రూపాయలకు పైగానే ఉంటోంది.

వాణిజ్య అవసరాలకు కూడా గ్యాస్ ధరల భారం గుదిబండగానే మారింది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే సిలెండర్ల ధరల భారాన్ని కూడా పరోక్షంగా వినియోదారులే భరించాల్సి వస్తోంది. ప్రధాని నరేంద్రమోడి ప్రభుత్వం 2020లో వాణిజ్య అవసరాలకు సంబంధించిన సిలిండర్ల సబ్సిని పూర్తిగా రద్దు చేసింది. పెరిగిన గ్యాస్ ధరల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో ఆందోళనలు పుట్టుకొస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News