Saturday, October 12, 2024

డబ్ల్యుటిసి ఫైనల్‌కు మరింత చేరువలో టీమిండియా

- Advertisement -
- Advertisement -

కాన్పూర్: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 20తో క్లీన్ స్వీప్ చేయడంతో భారత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ఇప్పటికే వరుసగా రెండు సార్లు డబ్లూటిసి టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్న భారత్ మరోసారి తుది పోరుకు చేరువైంది. భారత్ రానున్న రోజుల్లో మరో 8 టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో మూడు టెస్టు మ్యాచ్‌లు స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఆడాల్సి ఉంది. మిగిలిన 5 టెస్టులను ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ 8 టెస్టుల్లో మూడింటిలో గెలిచినా భారత్ డబ్లూటిసి ఫైనల్‌కు చేరడం ఖాయం.

అక్టోబర్ 16 నుంచి సొంత గడ్డపై కివీస్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇదే జరిగితే ఆస్ట్రేలియా సిరీస్‌తో సంబంధం లేకుండా భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంటుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ టీమ్ వరుస ఓటములతో సతమతమవుతోంది. ఇప్పటికే శ్రీలంక చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. ఇలాంటి స్థితిలో బలమైన భారత్‌తో సిరీస్ కివీస్‌కు సవాల్ వంటిదేనని చెప్పాలి. ప్రస్తుతం టీమిండియా ఉన్న స్థితిని గమనిస్తే వరుసగా మూడో సారి డబ్లూటిసి ఫైనల్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News