Thursday, May 2, 2024

తెలంగాణలో ‘పది’ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

Telangana 10th Class results 2021

 

10 జిపిఎ సాధించిన విద్యార్థులు 2,10,647
మొత్తం 535 పాఠశాలలకు 10/10 జిపిఎ
ఎఫ్‌ఎ 1 మార్కుల ఆధారంగా గ్రేడ్ల కేటాయింపు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం టెన్త్ ఫలితాలను విడదుల చేశారు. 2,10,647 మంది విద్యార్థులు 10 జిపిఎ సాధించినట్లు మంత్రి వెల్లడించారు. ఫలితాలను bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈసారి హాల్‌టికెట్ నెంబర్లు జారీ చేయడం వల్ల చదివిన విద్యార్థులు వారు చదివిన పాఠశాల పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేఏదీ వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే హాల్ టికెట్ నెంబర్‌తో పాటు ఏ గ్రేడ్ వచ్చిందో తెలుసుకోవచ్చు. ఫార్మేటివ్ అసెస్‌మెంట్(ఎఫ్‌ఎ) 1లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించారు.

కరోనా ఉధృతి నేపథ్యంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను ఉత్తీర్ణులను చేయాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం మేరకు అందరినీ ఉత్తీర్ణులను చేయడం జరిగిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 2020-21 విద్యా సంవత్సరంలో భౌతిక తరగతుల నిర్వహణ సాధ్యం కాని సమయంలో డిజిటల్ తరగతులను నిర్వహించిన తొలి రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ఇది ముఖ్యమంత్రికి విద్యా రంగం పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనమని అన్నారు. ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్‌లను నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

2,62,917 మంది బాలురు, 2,53,661 మంది బాలికలు
పదవ తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకొన్న 5,21,073 మంది విద్యార్థులను ఉత్తీర్ణులను చేసినట్లు మంత్రి వెల్లడించారు. వీరిలో 5,16,578 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 4,495 మంది గతంలో ఫెయిలై ప్రస్తుతం పరీక్ష ఫీజు చెల్లించినవారని అన్నారు. రెగ్యులర్‌గా హాజరై ఉత్తీర్ణత సాధించిన వారిలో 2,62,917 మంది విద్యార్థులు బాలురు కాగా, 2,53,661 మంది విద్యార్థులు బాలికలు ఉన్నారని తెలిపారు. 2,10,647 మంది విద్యార్థులు 10/10 జి.పి.ఎ సాధించినట్లు మంత్రి వెల్లడించారు. మొత్తం 535 పాఠశాలలు 10/10 జి.పి.ఎ సాధించాయని వెల్లడించారు.

ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా కేటాయించిన గ్రేడ్‌ల వివరాలను www.bse.telangana.gov.in, http://results.bsetelangana.org వెబ్‌సైట్‌లలో పొందవచ్చని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులకు సంబంధించిన పాస్ మెమోలను సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా తీసుకోవచ్చని మంత్రి సూచించారు. విద్యార్థుల పాస్ మెమోల్లో ఏవైనా పొరపాట్లు తలెత్తితే సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎస్.ఎస్.సి బోర్డుకు పంపితే వెంటనే సరిదిద్దడం జరుగుతుందని తెలిపారు. పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు భవిష్యత్‌లో మంచి కోర్సులను ఎంపిక చేసుకొని తమ భవిష్యత్‌ను బంగారుమయం చేసుకోవాలని మంత్రి కోరారు.

యాజమాన్యాలవారీగా 10/10 సాధించిన పాఠశాలలు

పాఠశాల                   మొత్తం పాఠశాలలు    10/10 సాధించిన పాఠశాలలు           విద్యార్థులు
1.ఎయిడెడ్                   185                           01                             2380
2. ఆశ్రమ్                     221                          00                             1847
3. బిసి సంక్షేమ              131                           57                             8185
4.ప్రభుత్వ పాఠశాలలు        492                          04                             4909
5. కెజిబివి                    475                          03                             5630
6.మోడల్ స్కూల్స్             194                          00                             6739
7. ప్రైవేట్ స్కూల్స్               5,047                       421                           1,2,809
8. రెసిడెన్షియల్                 51                             04                            2,151
9. మైనార్టీ రెసిడెన్షియల్         202                            05                            5,425
10.సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్  234                         10                               6,949
11.ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్   91                          01                               2,046
12. జిల్లా పరిషత్ పాఠశాలలు     4,122                     29                               42,577

మొత్తం                        11,445               535                          2,10,647

మీడియం వారీగా పది పరీక్షలకు రిజిష్టరైన విద్యార్థుల వివరాలు

1.ఇంగ్లీష్            3,69,464
2. హిందీ                311
3. కన్నడ               80
4.మరాఠి                193
5.తమిళ్                  4
6. తెలుగు             1,36,660
7. ఉర్దూ                   9,866
మొత్తం               5,16,578

Telangana 10th Class results 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News