Sunday, April 28, 2024

అప్పటి నుంచి ధైర్యంగా ఉంటున్నా

- Advertisement -
- Advertisement -

Radhika Apte has good craze in Bollywood

 

బాలీవుడ్ హాట్ బ్యూటీ రాధికా ఆప్టే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వివాదాలను వెంటేసుకుని తిరిగే హీరోయిన్లలో ఈమె ఒకరు. ఇక ఏదైనా సరే బోల్డ్‌గా చేయడమే ఈ భామకు అలవాటు. ఆన్ స్క్రీన్‌లో నటించి నా ఆఫ్ స్క్రీన్‌లో మాట్లాడినా అంతే. తెరపై ఎంత బోల్డ్‌గా నటిస్తుందో.. సోషల్ మీడియాలో అంతకు మించి హాట్‌గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఒరిజినల్ మూవీస్, – వెబ్ సిరీస్ లతో బిజీగా మారిన రాధిక.. అప్పట్లో ’క్లీన్ షేవెన్’ అనే షార్ట్ ఫిలిం కోసం న్యూడ్ గా కనిపించి సంచలనం రేపింది. దీనికి సంబంధించిన క్లిప్స్ లీకై నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. దీంతో రాధిక ఆప్టే న్యూడ్‌గా నటించడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సోషల్ మీడియాలో ఆమెపై నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. ఆ న్యూడ్ క్లిప్స్ లీక్ కావడం వల్ల జరిగిన పరిణామాలు తనను ఇబ్బంది పెట్టినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ్ట వెల్లడించింది.

అప్పుడు మీడియా, సోషల్ మీడియాలలో తన గురించి ఏమంటున్నారనేది పెద్దగా పట్టించుకోలేదని.. కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళు తనను అదో రకంగా చూడటం వల్ల ఇబ్బందికి గురయ్యానని రాధిక తెలిపింది. లీకైన వీడియోలో ఉన్నది తానే అని గుర్తించిన వాచ్ మ్యాన్, – డ్రైవర్ వంటి వారు తనవైపు అదోలా చూశారని.. వాళ్లను ఫేస్ చేయలేక నాలుగైదు రోజుల పాటు ఇంటికే పరిమితమయ్యానని రాధిక ఆప్టే చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ’పార్చ్’ సినిమాలో పూర్తి నగ్నంగా కనిపించానని.. ఆ పాత్ర చేశాక తనలో ధైర్యం వచ్చిందని చెప్పింది. అప్పటి నుంచి దాచుకోవడానికి ఏమీ లేదనే అభిప్రాయానికి వచ్చి ధైర్యంగా ఉంటున్నానని ఆప్టే పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News